Joe Biden : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్నాయి. ఇప్పటికే అధికార డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు. ఇప్పటికే ఇరువును నేతలు నిధుల సమీకరణ, ముఖాముఖి మీటింగ్‌లు, ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల పెన్సిల్వేనియాలో కాల్పులు జరిగాయి. మరోవైపు అంతకు ముంద ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన డిబేట్‌లో అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ తేలిపోయారు. డిబేట్ మధ్యలోనే స్ట్రక్ అయ్యారు. ఈ నేపథ్యంలో బైడెన్ పోటీపై అభ్యంతరాలు పెరిగాయి. పార్టీ అనుకూలురు, పార్టీ నేతలు, గవర్నర్‌లు, పార్టీకి నిధుల సేకరించేవారు.. అందరూ బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడమే మేలని భావించారు. డెమోక్రటిక్‌పార్టీపై ప్రజల్లో సానుకూలత ఉన్నా.. అభ్యర్థిపై వ్యతిరేకత ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ప్రత్యర్థి ట్రంప్‌పై ఇటీవల జరిగిన కాల్పులు.. రిపబ్లిక్ పార్టీకి అనుకూలంగా మారాయి. ఆ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై ఆదరణ ఒక్కసారిగా పెరిగింది. అప్పటికే సర్వేల్లో బైడెన్‌కన్నా… ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఇదే క్రమంలో కాల్పుల ఘటన ట్రంప్‌కు ప్లస్‌పాయింట్‌గా మారింది. ఈ నేపథ్యంలో బైడెన్ తప్పుకోవాలన్న ఒత్తిడి మరింత పెరిగింది. అభ్యర్థిని నిర్ణయించాక తప్పించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బైడెనే స్వయంగా తప్పుకోవాలి. ఈ క్రమంలో అన్నివర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా బైడెన్ తప్పుకోవాలని సూచించారు. ఇలా అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. అనారోగ్య సమస్యలు తలెత్తితే తప్పుకుంటానని బైడెన్ ప్రకటించారు.
కోవిడ్ పాజిటివ్..
ఈ క్రమంలోనే జో బడెన్.. నాలుగు రోజుల క్రితం కోవిడ్ బారిన పడ్డారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బైడెన్‌కు జలుబు, దగ్గు ఉండడంతో వైద్యులు కోవిడ్ పరీక్షలు చేశారు. అనారోగ్య సమస్యలు వస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బైడెన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన కోవిడ బారిన పడ్డారు. దీంతో ఆయన ప్రచారం నుంచి అర్ధంతరంగా తన ఇంటికి వెళ్లి ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. బైడెన్‌కు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. చికిత్స పొందుతున్నాడని వైట్‌హౌస్ ప్రకటించింది. ఆయనకు అందుతున్న చికిత్సపై కూడా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కమల హ్యారిస్‌పై హింట్..
అమెరికాలో తొలిసారి అధ్యక్షుల సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడు బైడెన్‌పై సానుకూలత ఉన్నా.. వయోభారం.. కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు డెమోక్రాట్లతోపాటు అనుకూల ఓటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ట్రంప్ పాలనను ఇప్పటికే చూసిన అమెరికన్లున ఆయనను వద్దని అనుకుంటున్నారు. ఇద్దరిపైనా ప్రస్తుతం అమెరికన్లు సారుకూలంగా లేదు. అయితే బైడెక్ కన్నా.. ట్రంప్ బెటర్ అన్న భావన అమెరికన్లలో ఉంది. తాజాగా ఆయనపై జరిగిన దాడితో ట్రంప్‌కు మద్దతు పెరిగింది. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి ఒక్కసారిగా భారత వారసత్వ మూలాలున్న కమలా హారిస్ పేరు తెరమీదకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరిలో జో బైడెన్‌కు బదులు కమలా హ్యారిస్‌ను డెమోక్రాట్ పార్టీ చివరి క్షణంలో బరిలో నిలిపే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ చిన్న హింట్ ఇచ్చారు. కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష పదవికి అర్హురాలు అని ప్రకటించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. నాలుగు రోజుల క్రితం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్స్ అన్వాల్ కన్వేషన్ కార్యక్రమంలో బైడెన్ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. హ్యారిస్ గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదని, ఆమె అమెరికా ప్రెసిడెంట్ కూడా కావొచ్చని ప్రకటించారు.
అగ్ర రాజ్యాం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రెసిడెంట్ రేసులో చివరకు నిలబడి తలపడేది ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతానికి అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్ పార్టీ నుంచి ఆ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలుస్తున్నారు. ఇద్దరూ ఎన్నికల క్యాంపేయ్ కూడా మొదలు పెట్టారు.
బైడెన్ కాదంటేనే కమలాకు ఛాన్స్..
ఇదిలా ఉంటే.. ఇటీవల నిర్వహించిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో అధ్యక్షుడు బైడెన్ తడబడగా.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించారు. బైడెన్ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని.. ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని రిపబ్లికన్లు సలహా ఇస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి బైడెన్‌కు బదులు మరో వ్యక్తికి అవకాశం ఇస్తే మంచిదని సొంత పార్టీ నేతలు కూడా సూచిస్తున్నారు. దీంతో బైడెన్‌కు బదులు కమలాహ్యారిస్ చివరి నిమిషంలో అధ్యక్ష రేసులోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఏక్షణంలోనైనా బైడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. ఆయన స్వయంగా వైదొలిగితే కమలాకు ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది.
కమలావైపు ప్రపంచం చూపు..
కమలా హారస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందన్న కథనాలతో.. ఇటు భారత్‌లోనూ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. మరోవైపు ప్రపంచం మొత్తం హ్యారిస్‌వైపు చూస్తోంది. సూపర్ పవర్ అమెరికాకు భారత సంతతికి చెందిన ఓ మహిళ అధ్యక్ష పీఠానికి చేరువ కావడం 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమే. మూడున్నరేళ్ల క్రితం ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కమలా హ్యారిస్.. ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష పీఠానికి దగ్గర కావడంతో ఇప్పుడు భారతీయులందరూ ఆమె వైపే చూస్తున్నారు.
తొలి మహిళా అధ్యక్షురాలు?
అమెరికా రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మహిళ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిష్టించలేదు. వైస్ ప్రెసిడెండ్ పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ కమలాహ్యారీసే. 1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినా.. పార్టీల ఓటమి కారణంగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. 2020 ఉపాధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారీస్ సాధించిన విజయం అంత ఈజీగా అయ్యింది కాదు. ఎన్ని ఆటంకాలు, విమర్శలు ఎదురైనా.. తన ప్రతిభతో సూపర్ పవర్ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు.
ట్రంప్.. టెన్షన్..
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్‌కు బదులు కమలా బరిలో నిలుస్తారన్న ప్రచారం నేపథ్యంలో ట్రంప్ టెన్షన్ పడుతున్నారు. వలస వచ్చిన వారికి జన్మించిన ఆమెకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ గతంలో ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. కమలా అధ్యక్ష అభ్యర్థి అయితే విమర్శల దాడిని ట్రంప్ మరింత పెంచే అవకాశం ఉంది.
=============
రేసు నుంచి తప్పుకున్న బైడెన్..
అంతా అనుకున్నట్లుగా.. బైడెన్ హింట్ ఇచ్చినట్లుగానే ట్విస్ట్ ఇచ్చారు. అధ్యక్ష పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేశం, డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. 81 ఏళ్ల బైడెన్ స్థానంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(59)కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. డెమోక్రాట్లు ఐక్యంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.
కారణం ఇదే…
అనేక విమర్శలు, వ్యతిరేకత, అన్ని వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాత అధ్యక్షుడు బైడెన్ రేసు నుంచి వైదొలగిల్సి వచ్చింది. ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లలో తప్పులుగా మాట్లాడడం, కాలుపల ఘటన తర్వాత ట్రంప్‌కు ఆదరణ పెరగడం తదితర కారణాలతో బైడెన్ తప్పుకున్నారని తెలుస్తోంది.
రేసులో పలువురు..
ఇక డెమోక్రాటిక్ అధ్యక్ష రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోలతోపాటు మరో ఆరు పేర్లు కూడా అధ్యక్ష రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే పోటీ నుంచి తప్పుకున్న బైడెన్ తర్వాత అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను ప్రకటించడంతో ఆమె అధ్యక్ష అభ్యర్థి అవుతారని తెలుస్తోంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపిక కమిటీ తదుపరి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తుంది. ఆగస్టులో జరగనున్న కన్వెన్షన్‌లో కమలా హ్యారిస్‌ను నామినేట్ చేస్తే, వైట్‌హౌస్‌కు నామినేషన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ–అ