TollyWood News : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసే ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యే దిశగా ముందుకు సాగాలనే ప్రయత్నంలో భాగంగా మంచి కథలను ఎంచుకోవాలని సినిమాలుగా చూస్తుంటారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యాన్స్ సంతోషంగా ఉంటున్నారా లేదా అనే విషయాలను పరిగణలోకి తీసుకొని మరి మన హీరోలు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోలుగా ముందుకు సాగుతున్నారు. మరి వీళ్ళ కెరియర్ మొదట్లో వదిలేసిన కొన్ని సినిమాలను చేసి ఇద్దరు నటులు స్టార్ హీరోలుగా ఎదిగారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. నిజానికి ఆ సినిమాలను కనుక వీళ్ళు చేసి ఉంటే వీళ్ళ కెరియర్లో మరింత ముందంజలో ఉండేవారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే కొన్ని సినిమాలు వాళ్ల ఇమేజ్ కి సెట్ అవ్వవు అనే ఉద్దేశ్యంతో రిజెక్ట్ చేస్తే, మరికొన్ని సినిమాలను మాత్రం సరిగ్గా అంచనా వేయలేక వదిలేసినవే కావడం విశేషం… ఇక ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోల్లో వీళ్ళు అగ్రశ్రేణి నటులు కావడం విశేషం…మరి వీళ్ళు వదిలేసిన సినిమాలతో స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరోలు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకుందాం…
ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలను చేసిన రవితేజ వాటితో మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. మొదటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ చేయాల్సింది. కానీ ఆయన వాటిని రిజక్ట్ చేయడంతో పూరి జగన్నాథ్ ఈ సినిమాలను రవితేజతో చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. తద్వారా రవితేజ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ వదిలేసిన ‘అఆ ‘ సినిమా ద్వారా నితిన్ కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆ సినిమాతో మొదటి సారి 50 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సినిమాలను కూడా రవితేజ చేసి స్టార్ డమ్ ను అందుకున్నాడు. ఇక ముఖ్యంగా ‘భద్ర ‘ సినిమా ను జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది. కానీ ఆ సినిమాను రవితేజ చేసి ఒక సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక అలాగే దిల్, సై సినిమాను కూడా ఎన్టీఆర్ చేయాల్సింది. కానీ నితిన్ ఆ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ రకంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాలను రవితేజ, నితిన్ చేసి స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళు చాలా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు…