https://oktelugu.com/

Horoscope Today: ఆయుష్మాన్ యోగం కారణంగా ఈ రాశి వారికి ధనలాభం..

ఈరోజు ద్వాదశ రాశులపై శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. సోమవారం ఆయుష్మాన్ యోగం కారణంగా తుల రాశి వారికి అధిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Written By:
  • Srinivas
  • , Updated On : July 22, 2024 / 08:48 AM IST
    Follow us on

    Horoscope Today: ఈరోజు ద్వాదశ రాశులపై శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. సోమవారం ఆయుష్మాన్ యోగం కారణంగా తుల రాశి వారికి అధిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వివాహ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఏ పని చేసిన జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వీరికి సీనియర్ల మద్దతు ఉంటుంది.

    వృషభ రాశి:
    ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టినట్లయితే పెద్దల సలహా తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు.

    మిథున రాశి:
    కుుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల ఆశీస్సులు ఉంటాయి. కొన్నిబాధ్యతలు నెరవేరుస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

    కర్కాటక రాశి:
    ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. వివిధ మార్గాల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు అనుకున్న విజయాలు సాధిస్తారు.

    సింహారాశి:
    వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కొందరికి అదనపు ఆదాయం రానుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినా వాటిని ధీటుగా ఎదుర్కొంటారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కటుంబ సభ్యులతో వాగ్వాదాలు వద్దు.

    కన్య రాశి:
    ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు భాగస్వాములతో కొత్త ఒప్పందానని చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లొచ్చు. ఉద్యోగులు అదనపు ప్రయోజనాలు పొందుతారు.

    తుల రాశి:
    ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహిరించాలి. కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. వ్యాపారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో ఓ శుభవార్త వింటారు. అయితే అనుకోకుండా ధన లాభం ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    పిల్లల విషయంలో కొత్త సమాచారాన్ని అందుకుంటారు. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. శత్రువల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు అనుకూల సమయం. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వారు ఏ పని చేసినా పురోగతి లభిస్తుంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. రావాల్సిన బకాయిలు నిలిచిపోతాయి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు.

    మకర రాశి:
    జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మీ ఇష్టానికి విరుద్దగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. సాయంత్రి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని ప్రాజెక్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం. ఈ విషయంలో ఎవరినీ నమ్మొద్దు.

    కుంభరాశి:
    ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. కటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాంకు నుంచి రుణం పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

    మీనరాశి:
    వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని నిర్ణయాల పట్ల అధికారుల సంతృప్తి చెందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.