spot_img
Homeఅంతర్జాతీయంJapan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి జనాలు అవస్థలు పడుతున్నారు. అధిక వేడితో చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్లలో నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. అసలు జపాన్ లో ఇలా ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమేంటి? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

జపాన్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశానికి సమీపంగా ఉండే సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఉన్న జపాన్ వాతావరణం కూడా వేడెక్కింది. కొన్ని గణాంకాల ప్రకారం.. దశాబ్దంలో ఈ దేశంలో సుమారు 1.3 సెల్సియస్ లు పెరిగినట్లు తెలుస్తోంది. మరో వైపు టోక్యో వంటి పెద్ద నగరాల్లో కాంక్రీట్ భవనాలు, రోడ్లు పగటిపూట వేడిని గ్రహించి రాత్రి కూడా విడుదల చేస్తున్నాయి. వాహనాలు, ఎయిర్ కండిషనర్లు విడుదల చేసే వేడి కూడా దీనికి తోడవుతుంది. ఫలితంగా నగర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు.

జపాన్ లో అధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉపశమనం కోసం చల్లటి ప్రదేశాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హ్యుమన్ ఫ్రిడ్జ్ గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. సాధారణంగా కిచెన్ వస్తువులు స్టోర్ చేసేందుకు ఫ్రిడ్జ్ వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనుషులు కూడా రిలాక్స్ కావడానికి ప్రత్యేకంగా హ్యుమన్ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేస్తున్నారు. దీనినే Do Hiemon Box అని కూడా పిలుస్తారు.

ఇందులో సుమారు 15 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇందులో కూర్చొవడం వల్ల శరీరం మొత్త 5 సెల్సియస్ డిగ్రీల గాలిని అందిస్తుంది. దీంతో 5 నుంచి 10 నిమిషాల్లో శరీర వేడి తగ్గుతుంది. ఇది స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేశారు. ఇందులో ఒక కుర్చీ ఉంటుంది. డోర్ క్లోజ్ చేసిన తరువాత తన పనిని ప్రారంభిస్తుంది. ప్రస్తుతం వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఇందులో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper