Homeఅంతర్జాతీయంItaly: ఇటలీలో పాకిస్తానీ దారుణం.. తట్ట బుట్ట సర్ది స్వదేశానికి పంపిన మెలోని

Italy: ఇటలీలో పాకిస్తానీ దారుణం.. తట్ట బుట్ట సర్ది స్వదేశానికి పంపిన మెలోని

Italy: అంతర్జాతీయంగా ఒక చట్టం ఉంటే.. ముస్లిం దేశాల్లో భిన్నమైన, కఠినమైన చట్టాలు అమలవుతుంటాయి. భారత దేశంలో కూడా ముస్లిం చట్టాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. వాటిని తొలగించేందుకే కేంద్రం సీఐఏ అమలు చేయాలని చూస్తోంది. అయితే ఇక పాకిస్తాన్‌లో అయితే చట్టాలు నేరస్తులకు చుట్టాలు. కానీ అంతటా అలా ఉండవు. ఈ విషయం తెలియని పాకిస్తాన్‌కు చెందిన ఓ మత బోధకుడు ఇటలీలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చివరకు అతడిని మెడలు పట్టి గెంటేయాల్సి వచ్చింది.

ఆరేళ్లుగా ఇటలీలో ఉంటున్న ఇమామ్‌..
పాకిస్తాన్‌కు చెందిన మత బోధకుడు(ఇమామ్‌)ఇటలీలో ఆరేళ్లుగా ఉంటున్నాడు. ఇటీవల ఓ టీవీ చానల్‌ డిబేట్‌లో పాల్గొన్నాడు. బాల్య వివాహాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం దేశ ప్రధాని జారిజయా మెలోనీ దృష్టికి వెళ్లింది. దీంతో అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించారు. ఈ సంఘటన దేశవ్యాప్త చర్చనీయాంశమైంది.

ఏం జరిగింది?
ఇటలీలో ఆరేళ్లుగా నివసిస్తున్న పాకిస్తానీ ఇమామ్‌ అలీ కషీబ్‌ టీవీ డిబేట్‌లో 40–50 ఏళ్ల వయసులో ఉన్నవాడు 10 ఏళ్లలోపు అమ్మాయిలతో వివాహం చేసుకోవడం సరైనదేనని ప్రకటించాడు. తాను కూడా దానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఇందుకు తమ మతం అనుమతి ఇస్తుందని చెప్పాడు. ఈ మాటలు ఇటలీలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.

మెలోనీ తక్షణ నిర్ణయం..
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకుని, అలీ కషీబ్‌ను దేశం నుంచి పంపిచ్చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో అతని మాటలు నిజమని నిర్ధారణైన తర్వాత, అతన్ని విమానం ఎక్కించి పంపారు. మెలోనీ ప్రభుత్వం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గట్టి వైఖరి పట్టుకుంటుంది.

చట్టాలకు లోబడే మత స్వేచ్ఛ..
ఈ సంఘటన ఇటలీలో ఇస్లామిక్‌ వలసవాదులతో ఉద్భవించే ఉద్రిక్తతలను తెలియజేస్తుంది. ఇటలీ చట్టాలు 18 ఏళ్లలోపు వివాహాలను నిషేధిస్తాయి, కానీ కొన్ని ఇస్లామిక్‌ సంప్రదాయాల్లో బాల్య వివాహాలు సాధారణం. అలీ కషీబ్‌ మాటలు మత అనుమతిని ఉదహరించినప్పటికీ, ఇటలీలో ఇది చట్టవిరుద్ధం. మెలోనీ ప్రతిస్పందన వలస రాజకీయాల్లో ఆమె దూకుడు వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఇటలీలో రైట్‌–వింగ్‌ పాలిటిక్స్‌ బలపడటానికి ఇది ఇంధనం అవుతుంది.

ఈ ఘటన ఇటలీలో మత సంప్రదాయాలు, ఆధునిక చట్టాల మధ్య సంఘర్షణను బహిర్గతం చేసింది. ఇది యూరప్‌లో వలసవాదులపై కఠిన చర్యలకు మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మత స్వేచ్ఛను పరిమితం చేయాల్సిన అవసరాన్ని చర్చించేలా చేశాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version