Homeక్రైమ్‌Changur Baba Case: విదేశాల నుంచి కోట్ల డబ్బు.. దేశంలో లవ్ జిహాద్ ప్రమోషన్.. చాంగుర్...

Changur Baba Case: విదేశాల నుంచి కోట్ల డబ్బు.. దేశంలో లవ్ జిహాద్ ప్రమోషన్.. చాంగుర్ బాబాకు మూడింది

Changur Baba Case: చాంగూర్‌ బాబా.. ఆరు నెలల క్రితం ఈ పేరు మార్మోగింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా, చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ బలరాంపూర్‌కు చెందిన చాంగూర్‌ బాబా లవ్‌ జిహాద్‌ కుట్రలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విదేశాల నుంచి వందల కోట్ల ఫండింగ్‌తో ఉత్తర భారత్‌లో మత మార్పిడి ఆపరేషన్లు నడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. చివరకు పోలీసులకు పట్టుపడ్డాడు. విచారణ జరుగుతోంది. ఏటీఎఫ్, ఈడీ చార్జిషీట్‌ దాఖలుకు సిద్ధమవుతున్నాయి.

చాంగూర్‌ బాబా నేపథ్యం..
జలావుద్దీన్‌ అలియాజ్‌గా పుట్టి, ’చాంగూర్‌ బాబా’గా చెలామణి చేసుకున్నాడు. బలరాంపూర్‌లో మదరసా, ఆశ్రమాలు నడుపుతూ విదేశీ డొనేషన్లు సేకరించాడు. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చిన డబ్బుతో యువతను టార్గెట్‌ చేసి లవ్‌ జిహాద్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాడు. హిందూ అమ్మాయిలను లవ్‌ ట్రాప్‌లలో పడగొట్టి మత మార్పిడి చేయించిన ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి.

2025లో పట్టుపడి..
2025 చివరలో ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ టీం తనిఖీల్లో పట్టుపడ్డాడు. ఈడీ కూడా మనీ లాండరింగ్‌ దర్యాప్తులో విదేశీ ఖాతాలు, ఆస్తులు బయటపడ్డాయి. అయితే ఇటీవల చాంగూర్‌ బాబా తనపై కేసు కొట్టడానికి స్పెషల్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు, కానీ కోర్టు దానిని తిరస్కరించింది. దీంతో యాంటీ టెర్రరిస్ట్‌ ఫోర్స్, ఈడీ అలర్ట్‌ అయ్యాయి. చాంగూర్‌బాబాపై 1400 పేజీల చార్జిషీట్‌ తయారు చేశాయి. ఇందులో 50కి పైగా సాక్ష్యాలు, 200+ వీడియోలు, ఫైనాన్షియల్‌ ట్రాకింగ్‌ ఉన్నాయి.

జీవితఖైదు ఖాయం?
చార్జ్‌షీట్‌ అన్‌లాఫుల్‌ అక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద ఫైల్‌ చేయబడింది. విదేశీ ఫండింగ్‌తో మత మార్పిడి, టెర్రర్‌ లింకేజ్‌లు నిరూపితమైతే జీవిత ఖైదు ఖాయం. ఇది రాష్ట్ర భద్రతకు ముప్పుగా పరిగణించబడుతోంది. యూపీ ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో గట్టి వైఖరి పట్టుకుంటోందిఇది రాజకీయంగా కూడా ప్రభావం చూపుతుంది.

ఈ కేసు హిందూ సమాజంలో చాంగూర్‌ బాబా పేరును శాశ్వతంగా గుర్తించేలా చేసింది. ఉత్తర భారత్‌లో మత మార్పిడి కుట్రలపై అవగాహన పెరిగింది. ప్రభుత్వ యాగాలు విజయవంతమైతే, ఇలాంటి అంతర్జాతీయ నెట్‌వర్కులు బలహీనపడతాయి. భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు, ఆస్తుల జప్తు జరగవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version