Homeఅంతర్జాతీయంWorld's largest highway : ప్రపంచంలోనే అతిపెద్ద హైవే ఇది.. ఎన్ని దేశాల మీదుగా దీన్ని...

World’s largest highway : ప్రపంచంలోనే అతిపెద్ద హైవే ఇది.. ఎన్ని దేశాల మీదుగా దీన్ని నిర్మించారంటే?

World’s largest highway : నదులు మానవ సంస్కృతికి బీజం వేస్తే.. రహదారులు నవ నాగరికతకు ఊపిరిలూదాయి. సింధు నుంచి మొదలుపెడితే చోళుల సామ్రాజ్యాల వరకు.. వారి రాజ్య విస్తరణలో రహదారుల కీలకపాత్ర పోషించాయి. అందుకే ఆధునిక సమాజ విస్తరణలో రహదారుల పాత్ర అత్యంత కీలకమైనది. మనుషులు పెరుగుతున్నా కొద్దీ, వారి అవసరాలు పెరుగుతున్నా కొద్దీ.. రహదారుల విస్తరణ, కొత్త వాటి నిర్మాణం అనేది అనివార్యమవుతోంది. అయితే ఈ రహదారుల నిర్మాణంలో ఒక్కో దేశంలో ఒక్కోశైలి ఉంటుంది.. గత పదేళ్లలో భారతదేశంలో ఎన్నో జాతీయ రహదారులు నిర్మాణమయ్యాయి. మరెన్నో రాష్ట్రీయ రోడ్లు ఏర్పాటయ్యాయి. రోడ్ల నిర్మాణంలో భారతదేశం సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది. దేశంలోని అన్ని నగరాలను అనుసంధానిస్తూ చేపడుతున్న రోడ్లు సరికొత్త భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఓ హైవే అత్యంత అతిపెద్దదిగా రికార్డుకి ఎక్కింది. ఇంతకీ ఆ రోడ్డును ఎక్కడ నిర్మించారంటే..

ప్రపంచంలో పలు దేశాలను కలుపుతూ ఎన్నో రోడ్లు ఉన్నప్పటికీ.. పాన్ అమెరికన్ హైవే అనేది అతిపెద్ద హైవేగా రికార్డ్ ఎక్కింది. ఇది ఉత్తర అమెరికాలోని కెనడాలో మొదలవుతుంది. ఆ తర్వాత అమెరికా, మెక్సికో, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వడార్, పెరూ, చిలి, బొలివియా వంటి 14 దేశాల మీదుగా దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది.

సముద్రం, ఎడారులు, నదుల మీదుగా ఈ హైవే నిర్మించారు. ఈ హైవే మొత్తం 30 వేల కిలోమీటర్లు. సముద్ర మార్గంలో సరుకు రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో.. ఆయా దేశాలు సంఘటితంగా ఏర్పడి ఈ రోడ్డును నిర్మించాయి. ఈ రోడ్డు ద్వారా సరుకు రవాణా, వస్తు సేవలను అందిస్తారు.. దేశాల మధ్య కనెక్టివిటీని పెంచుతారు. ఈ దేశాలకు సముద్ర మార్గంలో సరుకు రవాణా జరుగుతున్నప్పటికీ.. అనుకోని అవాంతరాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణానికి దాదాపు 7 నుంచి 9 సంవత్సరాల కాలం పట్టిందని తెలుస్తోంది.

ఈ రోడ్డును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. పర్యావరణ హితమైన వస్తువులను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించారు. ఎడారి, నదులు వంటి వాటి మీదుగా కూడా ఈ రోడ్డును నిర్మించారు. అయితే అక్కడి జంతువులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఫ్లై ఓవర్లు నిర్మించారు. దాదాపు 30 వేల కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు.. ప్రపంచంలోనే అతిపెద్ద హైవేగా వినతికెక్కింది. ఈ రోడ్డు మీదుగా ఇప్పటికే రాకపోకలు మొదలయ్యాయి.

ఈ రోడ్డు నిర్మాణంలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించారు. ఎక్కడ కూడా రాజీ పడలేదు. పైగా ఫ్లైఓవర్ నిర్మాణ విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నారు. భూకంపాలు వంటివి చోటు చేసుకున్నప్పుడు రోడ్డు ధ్వంసం కాకుండా ఉండేందుకు సరికొత్త టెక్నాలజీ వాడారు. ఫ్లై ఓవర్ల నిర్మాణంలోనూ అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version