https://oktelugu.com/

Mahesh Babu: నిహారిక కొణిదెల కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..మెగా ఫ్యామిలీ కూడా ఇంత సహాయం చెయ్యలేదుగా!

నిహారిక కొణిదెల తన తండ్రి నాగబాబు లాగ ఇండస్ట్రీ లో నిర్మాతగా రాణించాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు వెబ్ సిరీస్లను నిర్మించగా అవి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకోలేకపోయాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 12, 2024 / 01:58 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసి సరైన సక్సెస్ రాకపోయినప్పటికీ కూడా పట్టు వీడకుండా ఇండస్ట్రీ లోనే ఉంటూ సినిమా మీద విపరీతమైన పిచ్చి తో ఇండస్ట్రీ లో కొనసాగుతున్న వారిలో ఒకరు నిహారిక కొణిదెల. ఈమె కూడా తన తండ్రి నాగబాబు లాగ ఇండస్ట్రీ లో నిర్మాతగా రాణించాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు వెబ్ సిరీస్లను నిర్మించగా అవి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకోలేకపోయాయి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని కొత్త కుర్రాళ్లతో ఆమె చేసిన ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రం రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

    ఈ సినిమాని చూస్తున్నంతసేపు మన పాత కాలం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని, చాలా చక్కటి అనుభూతి కలిగించే సినిమాని నిర్మించినందుకు నిహారిక కి కృతఙ్ఞతలు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే మంచి సినిమా వస్తే ప్రోత్సహించడానికి ముందు వరుసలో ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమాని కూడా కాసేపటి క్రితమే ట్వీట్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కమిటీ కుర్రాళ్ళు చిత్రం గురించి ఎన్నో అబ్దుతమైన పాజిటివ్ రివ్యూస్ చూసాను. నిహారిక కొణిదెల నిర్మాతగా తన మొదటి సినిమాతోనే ఇంత మంచి సక్సెస్ ని అందుకున్నందుకు అభినందనలు. త్వరలోనే ఈ సినిమాని నేను చూడబోతున్నాను’ అంటూ మహేష్ బాబు వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ సంబంధించి ఎవ్వరూ కూడా ట్వీట్ వెయ్యలేదు. రాబొయ్యే రోజుల్లో వేస్తారేమో కానీ, అందరికంటే మహేష్ బాబు ముందుగా వెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్న సినిమాలను ప్రమోట్ చెయ్యడం మహేష్ బాబు కి అలవాటు. ఎన్నో సినిమాలు ఆయన ప్రోత్సాహం కారణంగా కమర్షియల్ సూపర్ హిట్స్ అయ్యాయి. మహేష్ బాబు ట్వీట్ తర్వాత కమిటీ కుర్రాళ్ళు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా లో వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే, నిహారిక మరియు మూవీ టీం మొత్తం మహేష్ బాబు ని ప్రత్యేకంగా కలిసి తమకి సపోర్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు తెలియచేయనున్నారట. రేపు, లేదా ఎల్లుండి ఈ కార్యక్రమం జరగనుంది.

    దానికి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆ ఫోటోలు బయటకి వస్తే సోషల్ మీడియా మొత్తం మోతెక్కిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఒక వ్యక్తి ని మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ప్రోత్సహిస్తున్నాడంటే మామూలు విషయం కాదు కదా. ఇక ‘కమిటీ కుర్రాళ్ళు’ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ చిత్రానికి మొదటి మూడు రోజులకి కలిపి సుమారుగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో కోటి రూపాయిల దూరం మాత్రమే ఉంది, ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.