Benjamin Netanyahu: పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్దం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. పాలస్తీనాలోని హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయేల్ యుద్ధం మొదలు పెట్టింది. దాదాపు ఏడాదిగా ఈ యుద్ధం కొనసాగుతోంది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయేల్ పౌరులను విడిపించిన ఐడీఎఫ్.. హమాస్ చీఫ్‌ను రెండ నెలల క్రితమే మట్టుపెట్టింది. దీంతో అప్పటి వరకు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాడిన హమాస్.. కాస్త వెనక్కు తగ్గింది. అయితే హమాస్ చీఫ్‌ను ఇరాన్‌లో మట్టుపెట్టడం.. ఆ దేశానికి కోపం తెప్పించింది. దీంతో లెబనాన్‌లోని హెజ్‌బొల్లా కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకారం దప్పదని హెచ్చరించాయి. అయితే హెజ్‌బొల్లాపై నిఘా పెట్టిన ఇజ్రాయోల్ సేనలు తమపై హెజ్‌బొల్లా దాడికి సిద్ధమవుతున్నట్లు గుర్తించింది. ప్రతిదాడి మొదలు పెట్టింది. దీంతో వారం రోజుల్లోనే హెజ్‌బొలా చీఫ్‌తోపాటు అతని కూతురును ఒకే రోజు హతమార్చింది. కోలుకోలేని దెబ్బతీసింది. అయినా హెజ్‌బొల్లా సేనలు వెనక్కి తగ్గడం లేదు. రాకెట్లతో ఇజ్రాయేల్‌పై దాడలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా వాటిని తిప్పికొడుతోంది. ఇలా భీకర వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇందులో ఇరాన్ పాలకులను గట్టిగా హెచ్చరించారు. ఆ దేశ పౌరులకు సంఘీభావంగా మాట్లాడారు.
నిరంకుశ పాలన..
ఇరాన్‌లో నిరంకుశ పాలన సాగుతోందని నెతన్యాహు ఆరోపించారు. ఈ పాలనను త్వరలోనే అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందిస్తామని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రతీరోజు ప్రజలను ఇరాన్ పాలకులు అణచివేస్తున్నారన్నారు. లెబనాన్‌ను రక్షించేందకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తూనే ఉన్నారు. వారి చర్యల కారణంగా ఇరాన్ మరింత అంధకారం అవుతోందని వెల్లడించాడు. యుద్ధం నానాటికీ తీవ్రమవుతోందని, ఇరాన్ నిరంకుశ పాలకులు ప్రజల భవిష్యత్‌ను పటించుకోవడం లేదు అని ఆరోపించారు. కోట్లాది డాలర్లు మధ్యప్రాచ్యంలో యుద్ధం క ఓసం వెచ్చిస్తున్నారని ఆరోపించారు. ఆ డబ్బును అణ్వాయుధాల కోసం కాకుండీ ప్రజల కోసం ఉపయోగిస్తే బాగుండు. పిల్లల చదువు, ఆరోగ్యం, మౌలిక వసుతల కల్పనకు ఉపయోగించాలి. కానీ పాలకులు అలా చేయడం లేదు అని ఆరోపించారు.
హెజ్‌బొల్లాకు మద్దతు..
ఉగ్రవాద సంస్థ అయిన హెజ్‌బొల్లాకు ఇరాన్ పాలకులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. హంతకులు, అత్యాచారం చేసేవారిని సమర్థించే ఇరాన్ పాలకుల తీరును వ్యతిరేకిస్తున్నాం. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే సంస్థలను పెకిలించి వేస్తున్నాం అని వివరించాడు. తమ దేశ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తామని ప్రకటించారు. నిరంకుశ పాలకులు మీకు కూడా అవసరం లేదని ఇరాన్ ప్రజలకు సూచించారు. త్వరలోనే నిరంకుశ పాలకుల నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు. తర్వాత రెండు దేశాల్లో శాంతి నెలకొంటుందని అన్నారు.
హమాస్ మెరుపు దాడితో..
గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి తర్వాత యుద్ధం మొదలైంది. ఇప్పుడు మరింత విస్తరించింది. మొన్నటి వరకు గాజాపై భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్‌బొల్లాను టార్గెట్ చేసింది. ఆ సంస్థ చీఫ్ నస్రల్లాను అంతం చేసింది. ప్రస్తుతం లెబనాన్ సరిహద్దుల్లో భూతల దాడులు మొదలు పెట్టింది. అటు హెజ్‌బొల్లా కూడా యుద్ధం కొనసాగిస్తోంది. దీనికి ఇరాన్ మద్దతు ఇవ్వడం ఇజ్రాయెల్ ఆగ్రహఆనికి కారణం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More