Israel-Iran : ప్రస్తుతం భారత్ ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది. అన్ని బాగుంటే మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు. నాలుగో ఆర్థిక శక్తిగా ఉన్నప్పటికీ భారత్ చెప్పినట్టు అమెరికా వింటోంది. రష్యా చెప్పిన ధరకు చమురు ఇస్తోంది. ఒపెక్ దేశాలు కూడా దారిలోకి వచ్చాయి. రేపటి నాడు పాకిస్తాన్ తో ఇబ్బంది ఎదురైనా, చైనాతో చికాకులు వచ్చినా భారతదేశానికి ప్రపంచం అండగా ఉంటుంది. బ్రిటన్ నుంచి మొదలు పెడితే అమెరికా వరకు సహకారం అందిస్తాయి. గత 10 సంవత్సరాలుగా బలమైన విదేశాంగ విధానం ఉండడం వల్ల భారత్ బలంగా మారింది. సరికొత్త శక్తిగా అవతరించింది. ఇటీవల రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధాని ఏకకాలంలో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ దేశంలో పర్యటించారు.. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని పేర్కొన్నారు.. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కూడా ఆ పని చేయడానికి సాహసించని నేపథ్యంలో.. మోడీ ఆ పని చేశారు. అంతకుముందు ఒపెక్ దేశాలతో అంతర్గత వివాదం ఏర్పడినప్పుడు.. దానిని అత్యంత తెలివిగా మోడీ పరిష్కరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే విదేశాంగ విధానంలో మోడీ తీసుకొచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు. అందువల్లే ప్రపంచ పటంలో భారత్ కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. అది ఇప్పుడు మరోసారి ప్రస్ఫుటమైంది.
ఇజ్రాయిల్ ఆగిపోయింది
పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయిల్ హోరాహోరీగా దాడులు చేసుకుంటున్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుందో చెప్పలేం గాని.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దాడులతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. విధ్వంసం తారస్థాయికి చేరడంతో అక్కడ ఏం జరుగుతుందో.. అంతు పట్టడం లేదు.. ఈ క్రమంలోనే ఇరాన్ – ఇజ్రాయిల్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. దానికి ఇజ్రాయిల్ ప్రతీకార దాడి చేయలేకపోయింది. వాస్తవానికి సాంకేతిక రంగంలో గొప్పగా ఉన్న ఇజ్రాయిల్ ప్రతి దాడి చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే దీని వెనుక భారత్ ఉందని యుద్దని నిపుణులు అంటున్నారు.. ప్రస్తుతం INS శార్దుల్, INS టిర్, ICGS వీరా గల్ఫ్ తీరంలో ఇరాన్ దేశంతో కలిసి శిక్షణలో పాల్గొంటున్నాయి. ఇప్పుడు ఒకవేళ దాడులు జరిగితే నష్టం తీవ్రత అధికంగా ఉంటుంది. అందువల్లే భారత్ ప్రత్యేకమైన చొరవతీసుకుంది. ఇజ్రాయిల్ దేశంతో మాట్లాడింది. అందువల్లే ఇరాన్ దాడులు చేసినప్పటికీ ఇజ్రాయిల్ సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా భారత్ చెప్పినట్టు ఇజ్రాయిల్ విన్నది. సాంకేతిక సహకారం అందించింది. పలు విషయాలలో భాగస్వామ్యాలను కుదురుచుకుంది. రెండు దేశాల మధ్య గొప్పగా ద్వైపాక్షిక వాణిజ్యం లేకపోయినప్పటికీ.. భారత్ అంటే ఇజ్రాయిల్ దేశానికి మొదటినుంచి గౌరవప్రదమైన స్థానం ఉంది. తమకు నమ్మకమైన దేశాలలో భారత్ కు ఇజ్రాయిల్ అగ్ర స్థానం ఇస్తుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Israel stopped the war on iran for india the big story behind this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com