US Israel Relations: పశ్చిమాసియాలో ఆధిపత్యం.. సామ్రాజ్యవాద విస్తరణ కోసం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాడు. ఇందుకు ఇజ్రాయెల్ సహాయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌ను టార్గెట్ చేయడానికి అమెరికాకు సహాయం చేసింది. అయితే దాదాపు రెండు నెలల యుద్ధం తర్వాత అమెరికాకు వాస్తవం తెలిసి వచ్చింది. ఇరాన్‌ను గెలవడం అంత ఈజీ కాదని అర్థమైంది. దీంతో ట్రంప్ శాంతిమంత్రం వల్లించడం మొదలు పెట్టాడు. ఇది ఇజ్రాయెల్‌కు నచ్చడం లేదు. లెబనాన్‌లోని హెజ్‌బుల్లాను అంతం చేయాలన్న ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. క్రమంగా అవి పెరిగి పెద్దవవుతున్నాయి. తాజాగా పెంటగాన్ ఇటీవల ఇజ్రాయెల్‌ను ‘‘క్రిటికల్’’ నిఘా బెదిరింపు రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపింది.
పెంటగాన్ ఆందోళన..
డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) ఇటీవలి వారాల్లో ఇజ్రాయెల్‌పై కౌంటర్ ఇంటెలిజెన్స్ థ్రెట్ లెవల్‌ను అత్యున్నత స్థాయికి పెంచింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు అమెరికా అధికారులను, ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోని సీనియర్ అధికారులపై నిఘా పెట్టినట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇరాన్‌తో అమెరికా అంతర్గత చర్చలు, వ్యూహాలు, నిర్ణయాల గురించి తెలుసుకోవడం. ఇజ్రాయెల్ ఈ సమాచారాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా అధికారులు ఇజ్రాయెల్‌కు వెళ్లేటప్పుడు లేదా ఇజ్రాయెల్ అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్నర్ ఫోన్లు (డిస్పోజబుల్ ఫోన్లు), క్లీన్ ల్యాప్‌టాప్‌లు వాడటం, హోటల్ గదుల్లో సెన్సిటివ్ చర్చలు నివారించడం వంటి చర్యలు ఇప్పుడు స్టాండర్డ్ ప్రొటోకాల్‌గా మారుతున్నాయి.
ట్రంప్–నెతన్యాహు మధ్య పెరుగుతున్న దూరం..
ఈ నిఘా ఆరోపణలు ఇరాన్ యుద్ధం తర్వాతి దశ గురించి రెండు దేశాల మధ్య ఏర్పడిన వ్యూహాత్మక అసమ్మతులతో ముడిపడి ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరిన్ని కఠిన చర్యలు కోరుతుంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్‌తో డిప్లమాసీ, సీజ్‌ఫైర్ దిశగా ముందుకు వెళ్తోంది. ఇటీవలి ఫోన్ సంభాషణలో ట్రంప్ నెతన్యాహుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్ తన జాతీయ భద్రతా ప్రాధాన్యతలను అమెరికా వ్యూహాలకు ముందు ఉంచుతోంది. అమెరికా తన మిత్రదేశం మీద కూడా పూర్తి విశ్వాసం ఉంచడం లేదు. ఇరాన్ సమస్యపై రెండు దేశాల లక్ష్యాలు భిన్నంగా ఉన్నాయనడానికి ఇది బలమైన సంకేతం.
ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్ తరపున ఈ ఆరోపణలను ఖండించారు. ఇది కేవలం అమెరికా అంతర్గత రాజకీయాలు లేదా ఇంటెలిజెన్స్ సంస్థల మధ్య ఉద్రిక్తత కావచ్చునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనలు అమెరికా–ఇజ్రాయెల్ మధ్య సమాచార మార్పిడి, సంయుక్త ఆపరేషన్లు, సైనిక సహకారంపై ప్రభావం చూపవచ్చు. దీర్ఘకాలికంగా మిడిల్ ఈస్ట్‌లో అమెరికా వ్యూహాలు మరింత స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే, ఇరు దేశాల మధ్య లోతైన స్ట్రాటజిక్, సైనిక, ఆర్థిక సంబంధాలు ఉన్నందున పూర్తి విచ్ఛేదనం సులభం కాదు. ఈ తాజా పరిణామాలు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి.
