Israel: ఇజ్రాయెల్ తన వ్యతిరేక శక్తులను వదిలి పెట్టడం లేదు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా.. తనపై దాడి జరిగే కుట్ర జరుగుతోందని సమాచారం అందిచే చాలు ఒప్పందాన్ని చెత్త బుట్టలో వేసి.. శత్రు సంహారం మొదలు పెడుతోంది. తాజాగా ఇరాన్– అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగున్నాయి. అమెరికాకు ఇజ్రాయెల్ మద్దతుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతుగా హమాస్, హెజ్‌బుల్లా, హూతీలు ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ ఏకకాలంలో హెజ్‌బుల్లా, హమాస్‌పై కోలుకోలేని విధంగా దాడులు చేసింది.
హెజ్‌బుల్లా కీలక నేత హతం..
దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లా సంస్థకు చెందిన కీలక ఇంజినీర్ అలీ దావుత్ అమీరిని రహస్య బంకర్‌లో గుర్తించి, కచ్చితమైన దాడితో అంతం చేసింది. ఈ నాయకుడు దక్షిణ లెబనాన్‌లో కొత్త నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసి, ఇజ్రాయెల్‌పై ప్రహరాలు ప్రణాళికాబద్ధంగా పెట్టుతున్నాడని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకుంది. గతేడాది జరిగిన యుద్ధ విరామ ఒప్పందాన్ని పక్కనపెట్టి, ఇజ్రాయెల్ తన భద్రతా ప్రయత్నాల్లో రాజీ లేకుండా ముందుకు వెళ్లింది.
హెజ్బుల్లాపై వరుస దాడులు..
2025 సెప్టెంబర్‌లో హెజ్బుల్లా సభ్యుల వాడుకలో ఉన్న పేజర్లు, వాకీ–టాకీలపై ఒకేసారి పేలుళ్లు జరిపించడం ఒక విప్లవాత్మక వ్యూహం. ఈ ఘటనల్లో వేలాది మంది ప్రభావితమయ్యారు, సంస్థకు తీవ్ర నష్టం సంభవించింది. తర్వాత అధినేత హసన్ నస్రుల్లాను భూస్వీయ బంకర్‌లో డ్రోన్ దాడితో సంహరించడం ద్వారా ఇజ్రాయెల్ సంస్థ పునర్నిర్మాణ ప్రయత్నాలను పూర్తిగా దెబ్బతీసింది. అలీ అమీర్ వంటి నాయకులను లక్ష్యంగా చేసుకోవడం హెజ్బుల్లా యొక్క పునరుద్ధరణ శక్తిని బలహీనపరుస్తుంది.
హమాస్‌పై దాడులు..
గాజాలో హమాస్ పట్టణాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. విద్యుత్ వ్యవస్థలను కూల్చివేసింది. ఈ చర్యలు హమాస్ యొక్క ప్రతిఘటన సామర్థ్యాన్ని పరిమితం చేయడానికి రూపొందించబడ్డాయి. హెజ్బుల్లాతోపాటు హమాస్‌పై ఒకేసారి దాడి చేయడం ఇజ్రాయెల్ యొక్క బహుâý వ్యూహాన్ని సూచిస్తుంది, ఇరాన్ మద్దతును బలహీనపరచడానికి ఉద్దేశించినది.
హౌతీలు తక్కువ..
హౌతీలపై ఇజ్రాయెల్ చర్యలు తక్కువగా ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో ఇజ్రాయెల్ హూతీలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇజ్రాయెల్ దాడులు ఆధునిక ఇంటెలిజెన్స్, డ్రోన్ సాంకేతికతలపై ఆధారపడి, శత్రు నాయకులను ఒక్కొక్కరుగా లక్ష్యంగా చేసుకునే వ్యూహాన్ని ప్రదర్శిస్తాయి. ఇది చిన్న సంస్థల పునరుద్ధరణను కష్టతరం చేస్తుంది, కానీ ప్రతీకార దాడులు, ప్రాంతీయ యుద్ధం రూపం తీసుకోవచ్చు. మధ్యప్రాచ్య స్థిరత్వానికి ఇది కొత్త ముప్పుగా మారనుంది.