Israel Attacked Qatar: ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ ప్రపంచంలో అత్యంత బలమైనది. శత్రువుల వ్యూహాలను పసిగట్టడంలో దిట్ట. ఇదే సమయంలో శత్రువలపై దాడి చేయడంలోనూ పక్కా ప్లాన్‌కు ఇంటలిజెన్స్ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఇజ్రాయెల్, తన శత్రువులను ప్రపంచవ్యాప్తంగా వెతికి లక్ష్య దాడులు చేస్తూ తన రక్షణ విధానాన్ని అమలు చేస్తుంది. తాజాగా ఖతార్ రాజధాని దోహాలో హమాస్ పాలిటికల్ విభాగ నాయకులపై చేసిన ఎయిర్ స్ట్రైక్ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ దాడి, గాజా యుద్ధం ముగింపు చర్చల మధ్యలో జరగడంతో మధ్యప్రాంత రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలను సృష్టించింది. ఖతార్‌లోని హమాస్ కార్యాలయంపై పదికిపైగా యుద్ధ విమానాలతో చేసిన ఈ దాడి, ఆరుగురు మరణాలకు కారణమైంది. ఇజ్రాయెల్ దీన్ని ’ప్రై సెజ్ స్ట్రైక్’గా పిలుస్తూ, హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది.
దాడి జరిగిందిలా..
ఖతార్ రాజధాని దోహాలోని కటారా జిల్లాలోని ఒక రెసిడెన్షియల్ కాంపౌండ్‌పై సెప్టెంబర్ 9, 2025న ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. ఈ ప్రదేశం హమాస్ పాలిటికల్ బ్యూరో సభ్యుల నివాసాలకు సమీపంలో ఉంది. దాడి సమయంలో హమాస్ నాయకులు అమెరికా ప్రతిపాదించిన గాజా సీజ్‌ఫైర్ ప్లాన్‌పై చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, డిఫెన్స్ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కలిసి ప్రకటించినట్లుగా, ఈ దాడి ఇచ్చిన ’ఆపరేషనల్ అవకాశం’కు బదులుగా జరిగింది. అక్టోబర్ 7, 2023 దాడి వెనుక హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ప్రధాన టార్గెట్ ఖలీల్ అల్–హయా, హమాస్ గాజా ఆపరేషన్స్ హెడ్, సీజ్‌ఫైర్ చర్చల్లో చీఫ్ నెగోషియేటర్. ఇతరులలో ఖాలెద్ మషాల్ (హమాస్ ఫార్మర్ ఓవరాల్ లీడర్), ముహమ్మద్ ఇస్మాయిల్ దర్వీష్ (షురా కౌన్సిల్ హెడ్), జాహర్ జబారిన్ (వెస్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ హెడ్) ఉన్నారు. హమాస్ ప్రకారం, ముఖ్య నాయకులు తప్పించుకున్నారు కానీ ఆరుగురు చనిపోయారు. అల్–హయా కుమారుడు, అల్–హయా ఆఫీస్ డైరెక్టర్ అబూ బిలాల్, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, మరొకరు ఉన్నారు. ఖతార్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యుడు బదర్ సాద్ ముహమ్మద్ అల్–హుమైదీ కూడా మరణించాడు. ఇజ్రాయెల్ మాత్రం అల్–హయాను చంపామని పేర్కొంది, కానీ హమాస్ దాన్ని ఖండించింది. ఈ దాడి, ఖతార్ ఎయిర్ స్పేస్‌ను దాటి 10కి పైగా ఫైటర్ జెట్‌లతో చేసిన మొదటి దాడిగా నిలిచింది. ఇది ఇజ్రాయెల్ శత్రువు ‘ఎవరైనా, ఎక్కడైనా’ విధానాన్ని ప్రదర్శిస్తుంది.
ఖతార్ కోపం, అమెరికా అసంతృప్తి..
ఖతార్ ఈ దాడిని ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రవక్త మజెద్ అల్–అన్సారీ ప్రకారం, దాడి ముందు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇది మరింత తీవ్రమైంది. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్–థానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ మీద మాట్లాడుతూ, దీన్ని ’రిక్క్లెస్ క్రిమినల్ అటాక్’గా పిలిచారు. ఇరాన్ దాన్ని ’గ్రాస్ వయోలేషన్’గా ఖండించింది, సౌదీ అరేబియా ’బ్రూటల్ అగ్రెషన్’గా వివరించింది – అయితే సౌదీ తమకు ఇజ్రాయెల్‌తో సంబంధాలు కాపాడుకోవడానికి యెమన్‌లోని హౌతీలపై దాడి చేసింది, ఇది ఇజ్రాయెల్‌కు మద్దతుగా సంకేతం. అమెరికా స్పందన మిశ్రమమైంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కారోలిన్ లీవిట్, దీన్ని ’యూనిలాటరల్ బాంబింగ్’గా విమర్శిస్తూ, ఖతార్‌ను ’క్లోజ్ అలై’గా పిలిచారు. ట్రంప్, దాడి ‘వెరీ అన్‌హ్యాపీ’ చేస్తుందని చెప్పారు, కానీ హమాస్‌ను అంతం చేయడం ’వర్తీ గోల్’గా భావించారు. యూఎస్ మిలిటరీ దాడి ముందు నోటిఫై చేసినప్పటికీ, ఏకపక్షంగా జరిగిందని స్పష్టం చేశారు. ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, ఖతార్ మధ్యవర్తిత్వాన్ని ప్రశంసిస్తూ దాడిని ’ఫ్లాగ్రెంట్ వయోలేషన్’గా పిలిచారు. యూరప్‌లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రాన్ కూడా ఖండించారు, ఇది ప్రాంతీయ ఎస్కలేషన్‌కు దారితీస్తుందని హెచ్చరించారు.