Homeఅంతర్జాతీయంYahya Sinwar: శత్రుశేషం మిగలకుండా.. హమాస్‌ను చావుదెబ్బకొట్టిన ఇజ్రాయెల్‌..!

Yahya Sinwar: శత్రుశేషం మిగలకుండా.. హమాస్‌ను చావుదెబ్బకొట్టిన ఇజ్రాయెల్‌..!

Yahya Sinwar: గతేడాది అక్టోబర్‌ 6 తేదీ వరకు ఇజ్రాయెల్‌ ప్రశాంతంగా ఉంది. తమ పని తాము చేసుకుంటూ పోతోంది. ఈ సమయంలో పాలస్తీనాలోని హమాస్‌ అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ సరిహద్దుపై దాడిచేసింది. ఈ దాడిలో 1,200 మంది మరణించారు. 250 మందిని హమాస్‌ సైన్యం బందీలుగా తీసుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్‌ ఆరోజే స్పష్టం చేసింది. హమాస్‌ అంతమే లక్ష్యంగా సైనిక చర్య చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాలస్తీనాలోని హమాస్‌ స్థావరాలపై దాడులు చేస్తూ వస్తోంది. మధ్యలో కొన్ని రోజులు విరామం ఇచ్చినా.. హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టాలన్న లక్ష్యాన్ని మాత్రం విస్మరించలేదు. హమాస్‌ను నడిపిస్తున్న కీలక కమాండర్లను అంతం చేస్తూ.. బందీలను విడిపించుకుంది. బందీలు విడుదలైనా ఇజ్రాయోల్‌ మాత్రం దాడులు ఆపడం లేదు. సొరంగాల్లో దాక్కున్న కీలక కమాండర్లందరినీ వెతికి మరీ పట్టుకుని అంతం చేసింది. తాజాగా అక్టోబర్‌ 7న జరిపిన దాడుల్లో హమాస్‌ చీఫ్‌ యహ్యా సిన్వార్‌ హతమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈమేరకు ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి కాట్జ్‌ గురువారం(అక్టోబర్‌ 17న) ప్రకటించారు. గాజాలోని సైనిక ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌ను ఐడీఎఫ్‌ హతమార్చినట్లు పేర్కొన్నారు. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ చేసినట్లు తెలిపారు.

కీలక సూత్వధారి సిన్వారే..
ఇదిలా ఉంటే.. 2023, అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి యహ్యా సిన్వారే కీలక సూత్రధారి. నాటి హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా సారథ్యంలో ఈ దాడి జరిగింది. తర్వాత ఇజ్రాయెల్‌ ఒక్కొక్కరినీ అంతం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో దాక్కున్న హమాస్‌ చీఫ్‌ హనియాను జూలై 31న ఐడీఎఫ్‌ సీక్రెట్‌ ఆపరేషన్‌ ద్వారా హతమార్చింది. దీంతో యహ్యా సిన్వార్‌ను ఆగస్టులో హమాస్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈమేరకు అతడిని ఐటీఎఫ్‌ టార్గెట్‌చేసింది. కొన్నిరోజుల క్రితం ఇజ్రాయెల్‌ బందీల మధ్య దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి.

ఎవరీ సిన్వార్‌…
యాహ్యా సిన్వార్‌ హమాస్‌ రాజకీయ చీఫ్‌. ఇస్మాయల్‌ హనియా మరణం తర్వాత హమాస్‌ చీఫ్‌గా బాధ్యతుల చేపట్టాడు. సిన్వార్‌ 1962లో గాజా స్ట్రిప్‌లోని శరణార్థి శిబిరంలో జన్మించాడు. ఇజ్రాయెల్‌ అతడిని ఇప్పటికే మూడుసార్లు అరెస్టు చేసింది. 2011లో ఇజ్రాయెల్‌ సైనికుడికి బదులుగా 127 మంది ఖైదీలతోపాటు సిన్వార్‌ను విడుదల చేసింది. ఇక 2015 సెప్టెంబర్‌లో అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో సిన్వార్‌ పేరు చేర్చింది. ఇస్మాయిల్‌ హనియా మరణం తర్వాత హమాస్‌ కీలక నిర్ణయాలను సిన్వారే తీసుకున్నారు.

యుద్ధం ఆగదు…
ఇదిలా ఉంటే.. కమాండర్లు హతమైనా యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు ప్రకటించారు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికీ వంద మంది ఇజ్రాయెల్‌ పౌరులు హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. వారిని సురక్షితంగా విడిపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైనిక చర్య చేపడుతోంది.

శత్రువులంతా అంతమైనట్లే!
గాజాపై యుద్ధం ప్రారంభించిన సమయంలోనే హమాస్‌ అగ్రనేతలందరినీ హతమారుస్తామని ఇజ్రాయెల్‌ ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలో ఒక్కొక్కరినీ వేటాడుతూ వచ్చింది. హమాస్‌ రాజకీయ వ్యవహారాల అధిపాతి ఇస్మాయిల్‌ హనియాను ఇటీవల టెహ్రాన్‌లో మట్టుపెట్టింది. మరో నేత మహ్మద్‌ డెయిప్నూను హతమార్చింది. ఏడాదికాలంగా గాజాపై దాడులు చేస్తూ కీలక కమాండర్లందరినీ చంపేసింది. ఇటీవల బీరుట్‌లో హెజ్‌బొల్లా కార్యాలయంపై వైమానికి దాడులు చేసి ఆ సంస్థ అధినేత నస్రల్లాను హతమార్చింది. తాజాగా హమాస్‌ చీఫ్‌ సిన్వార్‌ను అంతం చేసి శత్రుశేషం దాదాపు పూర్తయినట్లే అని ప్రకటించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular