Iran US war latest news: ఇరాన్ అణు కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఉగ్రవాదులను తయారు చేస్తోందనే ఆరోపణతో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రశాతంగా ఉన్న మిడిల్ ఈస్ట్‌లో నిప్పు రాజేశాడు. అది క్రమంగా రాజుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలను దహించివేస్తోంది. ఆయిల్ సంక్షోభానికి దారితీస్తోంది. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంవైపు నెడుతోంది. దీంతో యుద్ధం ప్రారంభించిన అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తీవ్రత..
యుద్ధం 12వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 1,700కి పైగా ఇరాన్ ఇన్‌స్టాలేషన్లపై అమెరికా దాడి చేసింది. ఇజ్రాయెల్ 1,600 సార్టీలు నడిపింది. వాయు రక్షణ వ్యవస్థలు, అణు కేంద్రాలు (నతాంజ్), ఇక ఆర్‌జీసీ బేసులు ధ్వంసమవుతున్నాయి. ఇరాన్ వాయు ఆధిపత్యాన్ని కోల్పోయి, ప్రాంతీయ పాలకులకు అధికారాలు అప్పగించుకుంది.
ఇరాన్ ప్రతీకార దాడులు..
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 10 వరకు 90కి పైగా మిస్సైల్–డ్రోన్ దాడులు చేసిన ఇరాన్, టెల్ అవీవ్‌లో 11 మరణాలు, 1,000 గాయాలకు కారణమైంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్ దాడులు, ఇజ్రాయెల్‌పై క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్ ప్రయోగించింది. మార్చి 11న కొత్త మల్టీ–వార్‌హెడ్ మిస్సైల్స్ ప్రవేశపెట్టింది.
రష్యాకు ట్రంప్ హెచ్చరిక..
ఇదిలా ఉంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రష్యాను ఇరాన్‌కు మద్దతు ఇవ్వకుండా హెచ్చరించారు, 50 వేల సైనికులు, 2 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లతో దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్–ఉన్ అమెరికా దాడులను ’అన్యాయం’గా ఖండించి, ఇరాన్ ప్రతీకారానికి మద్దతు తెలిపారు. ఈ మిశ్రమ స్పందనలు యుద్ధాన్ని ప్రపంచపు సమస్యగా మార్చాయి.
యుద్ధం మరింత తీవ్రం?
ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాలు ధ్వంసమైనా, రెజిమ్ మార్పు లేకుండా పూర్తి లొంగిపోకపోవచ్చు. ఇజ్రాయెల్‌పై దాడులు 60% పెరిగాయి, గల్ఫ్ రాజ్యాలు మూసివేసిన యూఎస్ ఎంబసీలు ఉద్రిక్తతను పెంచాయి. ఇరాక్ మిలిట్లు, హిజ్బుల్లా స్పందనలు యుద్ధాన్ని విస్తరిస్తున్నాయి.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులతో ఏడుగురు అమెరికన్ సైనికుల మరణించారు. ఈ ఘర్షణ కొన్ని వారాలు కొనసాగవచ్చని ట్రంప్ హెచ్చరించారు. ఆర్థికం, చమురు ధరలు పెరగడం, మధ్యప్రాచ్యంలో అస్థిరత పెరుగుతున్నాయి. మొత్తంగా రెండు దేశాల యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.