Homeఅంతర్జాతీయంIran US war: ఇరాన్‌ అమెరికా వార్‌.. పాకిస్తాన్‌తో ట్రంప్‌ రాయబేరం!

Iran US war: ఇరాన్‌ అమెరికా వార్‌.. పాకిస్తాన్‌తో ట్రంప్‌ రాయబేరం!

Iran US war: ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలై 24 రోజులైంది. అయినా ఇరాన్‌ 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో ఎదుర్కొంటోంది. అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో వారం పది రోజుల్లో ముగుస్తుందని భావించిన ట్రంప్‌కు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దీంతో యుద్ధం నుంచి సడెన్‌గా వైదొలిగితే ప్రపంచ పెద్దన్న పరువు పోతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ అమెరికా ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవడంతోపాటు, ప్రపంచం చమురు సంక్షభం ఎదుర్కొకుండా […]

Iran US war: ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలై 24 రోజులైంది. అయినా ఇరాన్‌ 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో ఎదుర్కొంటోంది. అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో వారం పది రోజుల్లో ముగుస్తుందని భావించిన ట్రంప్‌కు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దీంతో యుద్ధం నుంచి సడెన్‌గా వైదొలిగితే ప్రపంచ పెద్దన్న పరువు పోతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ అమెరికా ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవడంతోపాటు, ప్రపంచం చమురు సంక్షభం ఎదుర్కొకుండా ఉండేందుకునే సాకుతో ఐదు రోజులు యుద్ధ విరామం ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే ఇరాన్‌ ఎలాంటి చర్చలు జరుపడం లేదని ప్రకటించింది. ఈ క్రమంలో ట్రంప్‌ ఇప్పుడు యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు పాకిస్తాన్‌ను రంగంలోకి దించారు. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో పంపిన 15 పాయింట్లతో ఇరాన్‌కు ప్రతిపాదన పంపించారు.

ట్రంప్‌ శాంతి ప్రణాళిక ఇలా..
అగ్రరాజ్యం ప్రతిపాదనలో ఇరాన్‌ నతాంజ్, ఇస్పహాన్, ఫోర్డో అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని, 450 కిలోల యురేనియం ఐఏఈఏకి అప్పగించాలని, అణు శుద్ధి నిషేధించాలని, భవిష్యత్‌ ఆయుధాలు తయారు చేయకూడదని హామీ ఇవ్వాలని ప్రతిపాదించారు. హార్మూజ్‌ జలసంధి స్వేచ్ఛా మార్గంగా ఉండాలి, క్షిపణుల రేంజ్‌ను తగ్గించాలి. ప్రతీకారంగా ఆంక్షలు ఎత్తివేస్తామని, పౌర అణు శక్తికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం..
పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ ట్రంప్‌తో చర్చించి ఈ ప్లాన్‌ను ఇరాన్‌కు అందజేశారు. ఇస్లామాబాద్‌ చర్చలకు ఆతిథ్యం ఇస్తున్నారు, టర్కీ, ఈజిప్ట్‌తో కలిసి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇజ్రాయెల్‌కు ముందస్తు సమాచారం లేకపోవడం వివాదాస్పదంగా మారింది. యుద్ధం ఆపడాన్ని ఇజ్రాయెల్‌ ఒక్కటే వ్యతిరేకిస్తోంది. దీనిపై వైట్‌ హౌస్‌ స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇరాన్‌ తీవ్ర వ్యతిరేకత
ఇరాన్‌ ఐఆర్‌జీసీ ^పతినిధి అమెరికా ప్రణాళికను తిరస్కరించి, ‘ఓటమిని ఒప్పందంగా చెప్పవద్దు’ అని విమర్శించాడు. చర్చలు జరుగుతున్నాయని మొదట ఖండించినా, మిత్రదేశాల ద్వారా ప్రతిపాదనలు వచ్చాయని అంగీకరించారు. ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించమనేది ఇరాన్‌కు కష్టాజిప్‌.

మొత్తానికి చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో పెంటగాన్‌ మరో 1000 మంది సైన్యం, రెండు మెరైన్‌ యూనిట్లను పంపే సన్నాహాలు చేస్తోంది. ఇది ఒత్తిడి వ్యూహంగా కనిపిస్తుంది. ట్రంప్‌ యుద్ధ విరామానికి సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇరాన్‌ షరతులు ఒప్పుకుంటే చమురు మార్గాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరపడతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper