Trump Iran Conflict 2026: యుద్ధ పిపాస గల నాయకుడు రాజ్యాన్ని ఏలుతుంటే..నెత్తుటి ఏర్లు మాత్రమే ప్రవహిస్తాయి. కాస్త కటువుగా ఉన్నప్పటికీ ఇదే నిజం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అలానే వ్యవహరిస్తున్నాడు. ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగించడం.. గిట్టని నాయకుల మీద ఒత్తిడి తేవడం..అసరమైతే అపహరించి జైళ్లో వేయడం దారుణ మైన పనులకు పాల్పడుతున్నాడు.
ఇటీవల వెనిజులా అధ్యక్షుడిని అపహరించి తన దేశం తీసుకెళ్లి జైళ్లో పెట్టించిన ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ మీద పడ్డాడు. ఇరాన్ మీద దాడులకు సిద్ధం అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాడు. యుద్ధ విమానాలను, ఇతర సామగ్రిని భారీగా మోహరించాడు. దీంతో ఏ క్షణమైనా సరే ఏదైనా జరగొచ్చు అనే సంకేతాలు ఇస్తున్నాడు ట్రంప్.
అయితే ఇరాన్ విషయంలో ట్రంప్ వ్యవహారానికి అణు ఒప్పందం ఒక కారణం. ‘ఇరాన్ తల ఎగరేస్తే కుదరదు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే. ఇరాన్ కు 15 రోజుల వరకు గడువు ఉంది. గడువు లోపల ఒప్పందం కుదుర్చుకోవాలి. లేకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని’ ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా యుద్ధ విమానాలు ఇప్పటికే హార్మోజ్ జల సంధికి చేరుకున్నాయి. ఇరాన్, రష్యా కలిసిఇదే జలసంధిలో విన్యాసాలు చేయడం మొదలు పెట్టాయి. ఇది ఇలా సాగుతుండగానే ఆక్సియోస్ కీలక నివేదికను బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని అంతంచేయడానికి అమెరికా కుట్ర పన్నిందని ఆ నివేదికలో తేలింది. ఇరాన్ అగ్ర నేతలతో పాటు పలువురు ముల్లాలను అంతం చేయడానికి ట్రంప్ కుట్ర పన్నిన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అమెరికా రక్షణ శాఖకు టార్గెట్లు కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది.అమెరికా అధ్యక్షుడిని ఇటీవల అక్కడి సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో అభిశంసించింది. ప్రపంచ దేశాలతో వాణిజ్యం చేయాలి గాని.. ఇలా సుంకాలు విధిస్తూ ఇబ్బందిపెట్టడం ఏంటని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలో ట్రంప్ అటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఒకవేళ ట్రంప్ దాడులకు పచ్చజెండా ఊపితే పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయని తెలుస్తోంది.