Trump Controversial Comments On Iran: జ్ఞానం ఎవరి సొత్తు కాదు. తెలివి ఎవరి ఇంటి ఆస్తి కూడా కాదు. కాకపోతే ఎదుటివాళ్లను తక్కువ చూపు చూస్తే.. ఆ తర్వాత పరిణామం వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో కూడా అదే జరిగినట్టు కనిపిస్తోంది. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం.. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం.. ఎదుటి వ్యక్తులను తక్కువ అంచనా వేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అందువల్లే ట్రంప్ నిత్యం తన టెంపరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. కాకపోతే అమెరికా అధ్యక్షుడు కాబట్టి ప్రపంచం మొత్తం అతడు ఎన్ని వేషాలు వేసినా సరే చూస్తూ ఉంటుంది.
ఇరాన్ దేశంతో యుద్ధం సాగిస్తున్నప్పుడు యావత్ ప్రపంచం మొత్తం ట్రంప్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పు పట్టింది. అయినప్పటికీ ట్రంప్ తన ధోరణి మార్చుకోలేదు. పైగా ట్రూత్ సోషల్ లో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. ఇరాన్ దేశాన్ని నాశనం చేస్తానని ఒకసారి.. ఇరాన్ తలవంచక తప్పదని మరొకసారి.. ఇరాన్ దేశంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఇంకొకసారి
.. ఇలా రకరకాలుగా ఆరోపణలు చేశాడు. తను మాట్లాడిన మాటలకు.. అంతకుముందు మాట్లాడిన మాటలకు ఏమాత్రం పొంతనలేదు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్.. కూడా ట్రంప్ వ్యవహార శైలిని తప్పు పట్టింది అంటే అతని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇరాన్ దేశంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ట్రంప్ మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసినందు వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్పడం అందరిని ఆశ్చర్యం లో ముంచింది. వాస్తవానికి కొంతకాలంగా అమెరికా యుద్ధం నుంచి పక్కకు రావాలని భావిస్తున్నది. కాకపోతే తనంతట తానుగా అమెరికా బయటికి వస్తే పరువు పోతుందని భావించి పాకిస్తాన్ దేశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ.. అమెరికా అగ్రరాజ్యం కాబట్టి నోరు మెదపడం లేదు.
ట్రంప్ వ్యవహార శైలి తెలుసు కాబట్టి ఇరాన్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. సీజ్ ఫైర్ పై ఇరాన్ ప్రతిపాదించిన పది పాయింట్లు డాక్యుమెంట్లు ఇటీవల మీడియాలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ డాక్యుమెంట్ మొత్తం పార్సి, ఇంగ్లీష్ భాషల్లో ఉన్నాయి. పార్సి భాష, ఇంగ్లీష్ భాషలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. పార్సి భాషలో యురేనియం పై హక్కులు గుర్తించాలని డిమాండ్ కనిపించింది. ఇంగ్లీష్ వర్షన్ లో మాత్రం అది కనిపించలేదు. ఇదే విషయాన్ని అసోసియేటెడ్ ప్రెస్ బయటపెట్టింది. ట్రంప్ ను ఇరాన్ కావాలని వెర్రి వెంగళప్పను చేసిందని టాక్ వినిపిస్తోంది. న్యూక్లియర్ వెపన్స్ తయారీకి యురేనియం అత్యంత అవసరం.
ఇరాన్ దేశంలో యురేనియం నిల్వలు విపరీతంగా ఉన్నాయని అమెరికాలో గతంలో ఆరోపించింది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని కూడా సంచలన విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన దాడుల్లో కూడా యురేనియం శుద్ధి కర్మ గారాల ప్రస్తావన తెరపైకి వచ్చింది. అందువల్లే చాలా తెలివిగా ఇరాన్ పార్సి భాషలో.. ఇంగ్లీష్ భాషలో తేడాతో రూపొందించిందని.. ట్రంప్ ను తమ బుట్టలో వేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.