Homeఎంటర్టైన్మెంట్Dacoit Movie Special Show: వాళ్ల కోసం 'డెకాయిట్' మూవీ స్పెషల్ షో వేశారు...బొమ్మ హిట్టా...

Dacoit Movie Special Show: వాళ్ల కోసం ‘డెకాయిట్’ మూవీ స్పెషల్ షో వేశారు…బొమ్మ హిట్టా ఫట్టా…

Dacoit Movie Special Show: ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తున్న వారిలో అడవి శేషు ఒకరు… ఆయన వరుసగా విజయాలను సాధించడం అనేది అసాధ్యమనే చెప్పాలి. మధ్యలో చాలా ప్లాప్స్ పడుతూ ఉంటాయి. ఆ తర్వాత భారీ హిట్స్ దక్కుతుంటాయి. కానీ సక్సెస్ ఫార్ములాని తెలుసుకున్న అడివి శేషు మాత్రం సినిమా సినిమాకి ఏదో ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రేక్షకులను మైమరపింప చేస్తున్నాడు. ప్రస్తుతం డెకాయిట్ సినిమాతో […]

Dacoit Movie Special Show: ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తున్న వారిలో అడవి శేషు ఒకరు… ఆయన వరుసగా విజయాలను సాధించడం అనేది అసాధ్యమనే చెప్పాలి. మధ్యలో చాలా ప్లాప్స్ పడుతూ ఉంటాయి. ఆ తర్వాత భారీ హిట్స్ దక్కుతుంటాయి. కానీ సక్సెస్ ఫార్ములాని తెలుసుకున్న అడివి శేషు మాత్రం సినిమా సినిమాకి ఏదో ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రేక్షకులను మైమరపింప చేస్తున్నాడు. ప్రస్తుతం డెకాయిట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపద్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ షో ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకు వేసి చూపించారట. మొత్తానికైతే ఈ సినిమాలు చూసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీ పెద్ద సైతం పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

అందువల్లే సినిమా యూనిట్ ఈ మూవీ భారీ సక్సెస్ ను సాధిస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక ప్రేక్షకులు ఈ సినిమాకి ఎలాంటి సక్సెస్ ని కట్టబెడతారు. అడవి శేషు మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది… అయితే అడవి శేషు మాత్రం ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

మొదటి నుంచి ఆయన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని నమ్మాడు కాబట్టే ఈ మూవీ ఔట్ పుట్ బాగా వచ్చింది అంటూ ప్రతి ఒక్కరు అతన్ని ప్రశంసిస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే మరి కొద్ది గంటలపాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. ప్రేక్షకుల జడ్జిమెంట్ ఎలా ఉంటుంది. శేషు ఎక్కడ కూడా తడపడకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు.

కాబట్టి ఆయన అనుకుంటున్నట్టుగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో బ్లాస్ట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఆ రెండు సీన్స్ ఎలా ఎలివేట్ అవుతాయో చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper