US Iran conflict prisoner soldiers video: మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయిల్.. అమెరికాను ఏకకాలంలో ఇరాన్ అడ్డుకుంటున్నది. పరిమిత వనరులతో యుద్ధాన్ని చేస్తూ.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కోసం భారీగా ఖర్చు పెడుతున్న నేపథ్యంలో.. ఇరాన్ మాత్రం అత్యంత చవకైన మిస్సైల్స్.. డ్రోన్లు తయారుచేసి యుద్ధక్షేత్రంలో వాడుతోంది.. ఇరాన్ డ్రోన్లను కూల్చివేయడానికి అమెరికా, ఇజ్రాయిల్ భారీగా ఖర్చు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలు ఆర్థికయుద్ధం లాగా రూపాంతరం చెందుతున్నాయి.
అమెరికా దళాలు భీకరంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ లోని కీలక నగరాలలో నష్టం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ పెద్దలు అమెరికాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను వదిలి పెట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు. అమెరికా గనుక యుద్ధాన్ని ముగించకపోతే.. ఇది మరో స్థాయికి వెళ్తుందని.. ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వ పెద్దలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా యుద్ధాన్ని సాగిస్తున్నారు. ఫలితంగా అమెరికా తీవ్రస్థాయిలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది.
ట్రంప్ నిర్వాకం వల్ల సొంత దేశమైన అమెరికాలోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా అమెరికా తీరును తప్పుపడుతున్నాయి. వాస్తవానికి ఈ యుద్ధంలో అమెరికాకు ఎటువంటి పాత్ర లేకపోయినప్పటికీ.. మధ్యలో ప్రవేశించింది. న్యూక్లియర్ వెపన్స్ పేరుతో ఇరాన్ మీద దాడులు చేస్తోంది. అమెరికా దాడుల వల్ల ఇరాన్ దేశంలో చాలామంది చిన్న పిల్లలు చనిపోయారు. అయినప్పటికీ ట్రంప్ మనసు కరగడం లేదు.
ఇరాన్ దళాలు దాడులు చేయడంలో మాత్రమే కాకుండా.. అమెరికా సైనికులను పట్టుకోవడంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. తమ దేశంలో యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా సైనికులను ఇరాన్ దళాలు పట్టుకున్నాయి. వారిని ఒకచోట.. ఇరాన్ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ.. తమ జోలికి వస్తే అమెరికాకు ఇదే గతి పడుతుందని ఇరాన్ దళాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు యుద్ధాన్ని ముగించాలని.. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నది.
JUST IN:
Iran has released a video of captured U.S. soldiers… pic.twitter.com/ITvJPEbc9W
— Iran Mil Updates (@lran_prees) March 10, 2026