spot_img
Homeఅంతర్జాతీయంIran Missile Attack On US Base Diego Garcia: అమెరికా ఊహించని బేస్‌ను కొట్టిన...

Iran Missile Attack On US Base Diego Garcia: అమెరికా ఊహించని బేస్‌ను కొట్టిన ఇరాన్‌.. ట్రంప్‌ దిమ్మతిరిగింది!

Iran Missile Attack On US Base Diego Garcia: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం భీకరంగా సాగుతోంది. 22 రోజుల తర్వాత కూడా ఇరాన్‌ ఎక్కడా తగ్గడం లేదు. అమెరికా ఆర్థిక మూలాలను టార్గెట్‌ చేస్తోంది. తక్కువ ఖర్చుతో దాడులు చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలకు తీరని నష్టం కలిగిస్తోంది. ఇక తాజాగా అమెరికా ఇంటలిజెన్స్‌ కనీసం ఊహించని బేస్‌ను టార్గెట్‌ చేసింది. దీంతో ట్రంప్‌ దిమ్మతిరిగిపోయింది. డిగో గార్సియా సైనిక బేస్‌పై 4 వేల కిలోమీటర్ల రేంజ్‌ క్షిపణితో దాడి చేసింది. తన అధునాతన సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

Also Read: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్ర*గ్స్ పార్టీ: సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!

డిగో గార్సియాను కొట్టిన ఇరాన్‌..
హిందూ మహాసముద్రంలోని ఈ అమెరికా–బ్రిటన్‌ బేస్‌పై ఇరాన్‌ కొత్త రకం బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించింది. మలక్కా డ్రైన్, ఎర్రసముద్రం మధ్య ఈ ద్వీపం ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా వ్యూహాలకు కీలకం. ఇరాక్‌ యుద్ధంలో కూడా ఉపయోగపడింది. భారీ నష్టం జరగకపోయినా, ఇరాన్‌ రేంజ్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలియజేసింది.

ఇరాన్‌ క్షిపణి సామర్థ్యం బహిర్గతం..
అమెరికా ఇంటెలిజెన్స్‌ షేజిల్‌ మిస్సైల్‌ను ఇరాన్‌ అత్యంత దూర ప్రయోగ సామర్థ్యంగా భావించింది. కానీ 4 వేల కిలోమీటర్ల రేంజ్‌ కలిగిన కొత్త క్షిపణితో తన సత్తా ఏమిటో తెలిపింది. ఇది సౌత్‌ పార్స్‌ ఆయిల్‌ రిఫైనరీలపై అమెరికా దాడికి ప్రతీకారంగా వచ్చింది. ఇరాన్‌ రక్షణ వ్యవస్థలకు పరీక్షగా మారింది.

హిందూ మహాసముద్రం ఉద్రిక్తతలు
తాజా దాడితో హిందూ మహాసముద్రంలో జరిగిన రెండో దాడి ఇది. ఇటీవల విశాఖపట్నం నుంచి ఇరాన్‌ వెళ్తున్న యుద్ధనౌకపై శ్రీలంక సమీపంలో అమెరికా సబ్‌మెరైన్‌ దాడి జరిగింది. 180 మంది సైనికుల్లో కొందరు మరణించారు. ఇప్పుడు డిగో గార్సియా దాడితో భారత మహాసముద్ర ప్రాంతం యుద్ధ కేంద్రంగా మారింది. భారత్‌ రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలి.

అమెరికా స్టెల్త్‌ విమానం ఎఫ్‌–35 విఫలమవుతున్న వేళ.. ఇరాన్‌ తక్కువ ఖర్చుతో దీర్ఘకాల పోరాటం చేస్తోంది. తాజాగా లాంగ్‌ స్టెల్త్‌ క్షిపణి పరీక్ష నేపథ్యంలో అమెరికా ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు మరింత బలోపేతం అవసరం ఏర్పడింది. ఈ దాడి గ్లోబల్‌ రక్షణ వ్యూహాలను మార్చే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular