Homeఎంటర్టైన్మెంట్NTR Dragon Movie Weight Loss: డ్రాగన్' కోసం ఎన్టీఆర్ ఎన్ని కేజీల బరువు తగ్గాడో...

NTR Dragon Movie Weight Loss: డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ఎన్ని కేజీల బరువు తగ్గాడో తెలుసా..? ఇలా ఏ హీరోకి సాధ్యం అవ్వదు!

NTR Dragon Movie Weight Loss: ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్ ‘(Dragon Movie) మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఒక్క కంటెంట్ కూడా బయటకి రాలేదు. ఈఅప్పటికీ కూడా ఈ సినిమాకు అంత క్రేజ్ ఉండడానికి కారణం , ప్రశాంత్ నీల్. యూత్ ఆడియన్స్ మెంటలెక్కిపోయే రేంజ్ లో KGF సిరీస్, […]

NTR Dragon Movie Weight Loss: ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్ ‘(Dragon Movie) మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఒక్క కంటెంట్ కూడా బయటకి రాలేదు. ఈఅప్పటికీ కూడా ఈ సినిమాకు అంత క్రేజ్ ఉండడానికి కారణం , ప్రశాంత్ నీల్. యూత్ ఆడియన్స్ మెంటలెక్కిపోయే రేంజ్ లో KGF సిరీస్, సలార్ లాంటి సినిమాలను అందించాడు కాబట్టి. ఇప్పటికీ ఈ సినిమాలను ఓటీటీ లో యూత్ ఆడియన్స్ చూస్తూనే ఉంటారు. అలాంటి క్రేజీ డైరెక్టర్ తో , ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో జత కట్టడం వల్లే , ఈ రేంజ్ అంచనాలు ఈ చిత్రం మీద ఏర్పడ్డాయి. ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ లో ఉంటుందట.

Also Read: రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్ర*గ్స్ పార్టీ: సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. రీసెంట్ గానే జార్జియా లో రెండు మూడు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోందో. ఎన్టీఆర్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సినిమా కోసం ఎంతకైనా తెగించడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో యమదొంగ సినిమా కోసం ఎన్టీఆర్ ఏ రేంజ్ లో మేక్ ఓవర్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో ఎన్టీఆర్ లుక్ అందరికీ ఒక పెద్ద షాక్, డ్రాగన్ తో కూడా అదే రేంజ్ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 10 కిలోల బరువు తగ్గాడట. అది కేవలం మూడు నెలల వ్యవధి లో. అంటే ఈ లెక్కన ఆయన ఏ రేంజ్ లో వర్కౌట్స్ చేసి ఉంటాడో మీరే ఊహించుకోండి.

మాఫియా డాన్ రోల్ అంటున్నారు, పైగా నెగెటివ్ షేడ్స్ అంటున్నారు, మరి ఇంత సన్నగా కనిపిస్తే ఎలా అనే చిన్న అనుమానం అభిమానుల్లో ఉంది. కానీ మే 20 న విడుదల చెయ్యబోయే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో అందరి అనుమానాలు తీరిపోతాయని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని అంటున్నారు. అదే రోజున ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తారా. దేవర చిత్రం లాగానే , ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది దసరా కి దింపే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ రానుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణీ వాసంత్ నటిస్తుండగా, విలన్ గా మలయాళం యంగ్ హీరో తొనివో థామస్ నటిస్తున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper