Iran Israel Impact: పశ్చిమాసియాలో కీలక దేశాలైన ఇరాన్ – ఇజ్రాయిల్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సైనిక పరంగా, ఆర్థికపరంగా ఈ రెండు దేశాలు బలవంతమైనవి కావడంతో పోరు హోరాహోరిగా సాగుతోంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ ఇజ్రాయిల్ కు మద్దతుగా నిలిచాయి. ఏ క్షణమైన కూడా ఈ పరిణామం ప్రపంచ విపత్తుకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచం ఒక కు గ్రామంగా మారిపోయింది. గ్లోబల్ ట్రేడ్ వల్ల ప్రపంచ దేశాలు ఒకదానిమీద మరొకటి ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకి మనదేశంలో పండే వారి ధాన్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతుంది.. ఆఫ్రికా దేశాలలో పండే సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాల ఖర్జూరాలు మన దేశానికి వస్తుంటాయి.. ఇలా ఒక దేశం మీద మరొక దేశం ఆధారపడటం వల్ల యుద్ధం వంటి అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అంతిమంగా అవి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇరాన్ లో చమరు అధికంగా ఉంటుంది.. వాస్తవానికి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్నది కూడా చమురు మీదే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఖర్జూర తోటలు, వ్యవసాయ ఉత్పత్తులు ఇరాన్ ఆర్థిక రంగానికి చోదక శక్తి లాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అంతేకాదు ఎగుమతులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇరాన్ దేశం నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది.. ఇరాన్ నుంచి మనం ప్రధానంగా ఆర్గానిక్ కెమికల్స్, పండ్లు, గింజలు, ఆయిల్స్, ఉప్పు, సల్ఫర్, లైమ్, సిమెంట్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఐరన్, స్టీల్ వంటి వస్తువులను దిగుమతి చేసుకుంటాం. దేశీ అవసరాలకు అనుగుణంగా వీటిని మార్చుకుంటాం. అయితే ఈ వస్తువుల్లో అన్నీ కూడా దాదాపు రా మెటీరియల్ గా మాత్రమే ఉంటాయి. అందువల్ల వచ్చిన రా మెటీరియల్ ను మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటాం. వీటి విలువ వేలకోట్లలోనే ఉంటుంది.
Also Read: ఒకే ఓవర్లో ఐదు వికెట్లు.. దిగ్వేష్ రాటి పెను సంచలనం.. లక్నో ఓనర్ ఏం చేశాడంటే?
ఇక సాంకేతికతకు పెట్టింది పేరైన ఇజ్రాయిల్ దేశం నుంచి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఫెర్టిలైజర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, అల్యూమినియం, కొన్ని రకాల రసాయనాలు, వివిధ రకాల ముత్యాలను మనం దిగుమతి చేసుకుంటాం.. గతంలో ఇజ్రాయిల్ నుంచి బిందు సేద్యం, సూక్ష్మ సేద్యం పరికరాలను దిగుమతి చేసుకునేవాళ్ళం. కాకపోతే మన దగ్గర కూడా అదే స్థాయిలో సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో.. దేశంలోనే ఆ పరికరాలను తయారు చేయడం మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో.. ఆ వస్తువుల ధర పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే త్వరగా పరిస్థితులు చక్కబడితే ఇబ్బంది ఉండదని.. ఒకవేళ విపత్కర పరిస్థితులు నెలకొంటేనే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ” పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే వస్తువుల ధరలు పెరిగిపోయి గిరాకీ తగ్గిపోయింది. ఒకవేళ యుద్ధం అంటూ కొనసాగితే అప్పుడు ఆ వస్తువుల ధర పెరుగుతుంది. సప్లై తక్కువగా ఉండటం వల్ల ధరల స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితి అక్కడదాకా రాకముందే యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నామని” ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.