Israel: ఇజ్రాయిల్ వరుసగా కీలకమైన దాడులు చేస్తూ ఇరాన్.. దానికి అండగా ఉంటున్న హమాస్, హెజ్ బొల్లా పై వ్యూహాత్మకంగా ఎటాక్ చేసింది. కీలక సమయంలో ఇరాన్ కు అండగా ఉండకుండా కోలుకోలేని నష్టం చేసింది. ఆ తర్వాత ఇరాన్ మీద పడింది. ఇటీవల తమ దేశంపై చేసిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ స్పష్టత ఇచ్చారు..” ఇజ్రాయిల్ ఇరాన్ దేశంపై చేసే దాడులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికపై తనకు అవగాహన ఉందని” బైడన్ పేర్కొన్నాడు.. బైడన్ చెప్పిన సమాధానం తర్వాత ఒకసారిగా పశ్చిమాసియాలో పరిస్థితులు మారిపోతున్నాయి. 1న ఇరాన్ భారీ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ పై దాడి చేసింది. అయితే ఈ క్షిపణులు కొన్ని టార్గెట్లకు దూరంగా పడ్డాయి. అయితే మీరుల వాటిని ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే దీనికి కౌంటర్ ఎటాక్ తప్పదని ఇజ్రాయిల్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఇరాన్ రాజధాని తెహరాన్ పై దాడులు చేసేందుకు సైన్యాన్ని భారీగా మోహరించిందని.. భారీగా పేలుడు సామగ్రిని ఇజ్రాయిల్ సిద్ధం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరోవైపు ఇజ్రాయిల్ దాడులకు సిద్ధం కావడం.. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆ దాడులకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని చెప్పడంతో.. ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది..” ఇజ్రాయిల్ చేసే దాడులు.. సైనిక దురాక్రమణ అమెరికాకు తెలుసు. అయినప్పటికీ మౌనంగా ఉంటున్నది. పైగా దాడులకు సంబంధించి ఆయన వద్ద ప్రణాళిక ఉందని అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. ఆయన చేసిన ప్రకటన కూడా ప్రమాదకరంగా ఉంది. పైగా ఇజ్రాయిల్ దేశాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇలాంటి ప్రకటన చేస్తే అంతర్జాతీయ చట్టాలు ఏమైపోవాలి. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రాథమిక సూత్రాలు కాలగర్భంలో కలిసిపోయినట్టే కదా. ఇజ్రాయిల్ పాల్పడుతున్న దురాక్రమణకు పూర్తిగా అమెరికా బాధ్యత వహించాలని” ఇరాన్ పేర్కొన్నదని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అమెరికా ప్రెసిడెంట్ ప్రకటనతో..
ఇక అక్టోబర్ 1న ఇజ్రాయిల్ పై క్షిపణి దాడులు చేసింది. అంతకుముందు ఇజ్రాయిల్ హెజ్ బొల్లా నస్రుల్లా ను హతమార్చింది. దీనికోసం భారీ ప్రణాళిక రూపొందించింది. ఆయన భూగర్భంలో దాగి ఉన్నప్పటికీ.. అత్యంత శక్తివంతమైన బాంబులు ప్రయోగించి ఆయనను చంపేసింది అంతేకాదు అంతకుముందు హమాస్ చీఫ్ ను హతమార్చింది. ఎన్నో వ్యూహాత్మక ఆపరేషన్లు చేసి ఇరాన్ దేశానికి చుక్కలు చూపిస్తోంది. తన అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ఏ దేశానికైనా ఇలాంటి గుణపాఠమే చెబుతామని స్పష్టం చేస్తోంది.. దీంతో పశ్చిమాసియాలు పరిస్థితులు అంతకంతకు దిగుజారి పోతున్నాయి. ఇజ్రాయిల్ దాడులకు ప్రణాళిక రూపొందించినది అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఇప్పటివరకు ఇరాన్ దేశానికి చూపించింది శాంపిల్ మాత్రమేనని.. ఇకపై ప్రతిరోజు దీపావళి పండుగ ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..” ఇరాన్ బలమైన దేశం. ఇజ్రాయెల్ కంటే ఎంతో మెరుగైన దేశం. అలాంటిది ఇజ్రాయిల్ ను చూసి భయపడుతోంది. క్షిపణులతో దాడులు చేసినప్పటికీ ఇజ్రాయిల్ ఏ మాత్రం భయపడడం లేదు. పైగా ఇరాన్ కు వంతపడే ఉగ్రవాద సంస్థలకు చుక్కలు చూపిస్తోంది. ఈ లెక్కన ఇజ్రాయిల్ వెనుక అమెరికా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని” అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఇజ్రాయిల్ దూకుడు నేపథ్యంలో.. ఇరాన్ దౌత్య వేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు..” ఇజ్రాయిల్ ఇరాన్ పై ప్రతీకార దాడులకు పాల్పడబోతోందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది వాస్తవ రూపం దాల్చితే.. దానికి అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని” ఇరాన్ రాయబారి అమీర్ సయూద్ ఇరావనీ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. అంతేకాదు భద్రతా మండలి స్విస్ ప్రెసిడెన్సికి కూడా ఆయన ఈ లేఖను పంపించారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Iran is scared by israel successive key attacks
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com