Homeఅంతర్జాతీయంIran Economy Collapse: కుప్పకూలుతున్న ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ.. భారీగా పడిపోతున్న రియాల్‌ విలువ!

Iran Economy Collapse: కుప్పకూలుతున్న ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ.. భారీగా పడిపోతున్న రియాల్‌ విలువ!

Iran Economy Collapse: ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశ కరెన్సీ రియాల్‌ విలువ పతనం ఆగడం లేదు. దీంతో ప్రజలు పెరిగిన నిత్యావసర ధరతో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక డాలర్‌ విలువ ఇరాన్‌లో 14 లక్షల రియాల్‌కు చేరింది. దీంతో సామాన్యులు రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. భారత రూపాయితో పోల్చితే, కేవలం రూ.90తో 14 లక్షల రియాల్స్‌ పొందవచ్చు. గత డిసెంబర్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ రెజా ఫార్జిన్‌ రాజీనామా చేశారు.

యుద్ధాలు, ఆంక్షలతో సతమతం..
గత జూన్‌లో ఇజ్రాయిల్‌తో ప్రారంభమైన యుద్ధం ఇరాన్‌ పతనాన్ని వేగవంతం చేసింది. అమెరికా యూక్లియర్‌ సైట్లపై దాడులు, ఐకేయరాష్ట్ర సమితి ఆంక్షలు ఆర్థికాన్ని కుంగదీశాయి. 2018లో ట్రంప్‌ పాలిసీతో జిల్లెడిన ఆయిల్‌ ఎగుమతులు, విదేశీ ముద్ర లభ్యత తగ్గడం సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి.

40 ఏళ్లలో 20 వేల రెట్లు పతనం..
1979 విప్లవ సమయంలో డాలర్‌ విలువ 70 రియాల్స్‌కు సమానంగా ఉండేది. 2026 ప్రారంభంలో 14 లక్షలకు చేరింది. 40 ఏళ్లలో విలువ 20,000 రెట్లు పడిపోయింది. 2025లో మాత్రమే 45 శాతం క్షీణత. బంక్‌ డబ్బులు కరిగిపోతాయని భయపడి పౌరులు డాలర్లు, బంగారు కొనుగోళ్లకు దూకుతున్నారు.

కట్టలు తెగుతున్న ప్రజాగ్రహం..
డిసెంబర్‌లో తెహ్రాన్‌ గ్రాండ్‌ బజార్‌ వ్యాపారులు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడ్డారు. రియాల్‌ పతనంతో రుణాలు పెరిగి, విద్యార్థులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జొమ్హౌరి అవెన్యూలో ప్రారంభమైన ఇది ఇప్పుడు అయతోల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌పై పోరుగా మారింది. 2022లో మహ్సా అమినీ మరణం తర్వాతి అల్లర్లు ఇప్పటి అగ్నిపర్వతాన్ని పెంచాయి.

భారత్‌పై ఫ్రభావం..
ఇరాన్‌ సంక్షోభం భారత్‌పైనా ప్రభావం పడే అవకావం ఉంది. మన దేశం గతేడాది 1.24 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్సత్తులను ఎగుమతి చేసింది. 0.44 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 1.68 బిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో రూ.15 వేల కోట్లకుపైనే. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎగుతులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular