Anil Ravipudi: వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం తన కెరియర్లో చేసిన తొమ్మిదోవ సినిమాని సైతం సక్సెస్ గా నిలిపాడు. త్రిబుల్ హ్యాట్రిక్ ను సాధించిన దర్శకుడిగా గొప్ప గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లను సాధించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ప్రస్తుతం తన పదో సినిమాని ఎవరితో చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడు హ్యాట్రిక్ లను సాధించిన అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని సైతం సక్సెస్ ఫుల్ గా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2027 సంక్రాంతి కానుకగా ఆ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
నాగార్జునతో సినిమా చేయాలని అనుకున్నప్పటికి ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమా చేయడంలో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అప్పుడే అనిల్ రావిపూడి కి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. గత సంవత్సరం సంక్రాంతికి సూపర్ సక్సెస్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి సీక్వెల్ గా వెంకటేష్ తో సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నప్పటికి ప్రస్తుతం వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో బిజీగా ఉన్నాడు.
అలాగే ఆ సినిమా తర్వాత ‘దృశ్యం 3’ సినిమా చేయడానికి కూడా చేయడానికి కమిట్ అయ్యాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం వెంకటేష్ అనిల్ రావిపూడి కి అవలెబులిటి లో ఉండే అవకాశం లేదు… ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ హీరోగా తను ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చినప్పటికి అవేవీ ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది.
కారణం ఏంటి అంటే అనిల్ రావిపూడి – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అనేది వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు…ఎందుకంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇప్పుడు అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనేదే అందరిని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది…