Kim Jong: కిమ్ జోగ్.. ఉత్తరకొరియా అధ్యక్షుడు.. హిట్లర్ తర్వాత ఆ స్థాయిలో నియంత అనిపించుకునేలా పాలిస్తున్నాడు. ఈయన తర్వాత స్థానంలో గడాఫీ ఉన్నాడు. అంతటి నియంత కాబట్టే కిమ్ జోంగ్ ఎవరినీ నమ్మడు. జనం ఆకలితో చస్తున్నా, ఉద్యోగం, ఉపాధి లేక యువత ఇబ్బంది పడుతున్నా పట్టించుకోడు. అమెరికా నుంచి బ్రిటన్ దాకా ఆంక్షలు విధించినా తలవంచడు. అణు ఆయుధాల తయారీని మానుకోడు. జీవితకాల అధ్యక్షుడుగా ప్రకటించుకున్న కిమ్ .. తనకు అడ్డువస్తున్నారనే అనుమానంతో సొంత బాబాయ్ ని, వరుసకు సోదరులయ్యే వారిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మంత్రివర్గంలో ఉన్నవారు గూడ చర్యం చేస్తున్నారని అనుమానిస్తూ వారిపై విష ప్రయోగం చేశాడు. కానీ ఇంతటి కిమ్.. మహా పిరికివాడు! ఏంటి అంతటి నియంత.. పిరికివాడు కావడం ఏంటని అనుకుంటున్నారా? అయితే చదవండి మరి.

ఈమధ్య ఐక్య రాజ్య సమితి నిర్వహించే ఒక మీటింగ్ కు కిమ్ వెళ్లాల్సి వచ్చింది. తన ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో కిమ్ ప్రత్యేక విమానం ద్వారా అక్కడికి వెళ్ళాడు. అక్కడ టాయిలెట్లో విసర్జించిన తన వ్యర్ధాలను కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేయించి తన దేశానికి తీసుకువెళ్లాడు. మొదట్లో భద్రతా సిబ్బందికి ఇది ఆశ్చర్యంగా అనిపించింది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే కిమ్ ఆ మధ్య అమెరికా మీద అణు బాంబులు వేస్తానని బెదిరించాడు. ఈ ప్రకటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కి పడింది. ఆ దేశంలో భారీగా అణు ఆయుధాలు ఉన్నాయని ఆరోపించింది. కానీ ప్రపంచ దేశాల ఆరోపణలు నిజం చేస్తూ తన వద్ద ఉన్న అణు ఆయుధాలు కిమ్ ప్రదర్శించాడు.

దీంతో రెచ్చిపోయిన పలు దేశాలు ఆంక్షలను మరింత కఠినం చేశాయి. ఈ క్రమంలోనే ప్రపంచ శాంతిని కోరుకుంటున్న ఐక్యరాజ్య సమితి కిమ్ ను పిలిపించింది. కానీ ఈ చర్చల విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. వాస్తవానికి ఐక్యరాజ్యసమితి చర్చలకు వెళ్లేందుకు కిమ్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ తన ఆరోగ్యం పై వదంతులు సృష్టిస్తున్న మీడియాకు సరైన సమాధానం చెప్పాలనే ఆలోచనతోనే ఆయన ఆ పర్యటనకు వెళ్లారు. కిమ్ ప్రత్యేక విమానం మాత్రమే కాదు ప్రత్యేక రైలులో కూడా ప్రయాణిస్తారు. అన్ని బోగీల్లో భద్రత సిబ్బంది ఉండేలా చూసుకుంటారు. తాను వెళ్లాలనుకున్న ప్రాంతం వరకు ముందు భద్రత దళాలతో పహారా నిర్వహించి తర్వాత వెళ్తారు. గతంలో జర్మనీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిట్లర్ కూడా ఇలానే వ్యవహరించే వారని చరిత్రకారులు చెబుతుంటారు. 1990 దశకంలో గడాఫీ, సద్దాం హుస్సేన్ లాంటి అధ్యక్షులు కూడా ఇదే పంథాను అనుసరించేవారు. ప్రస్తుతం వారి బాటనే కిమ్ పయనిస్తున్నారు. ఎదుటి మనుషులను కర్కశంగా చంపేసే కిమ్ ప్రాణ రక్షణతో ఇలా చేయడం నిజంగా ఆశ్చర్యకరమే!

