Surekha Vani: నటి సురేఖా వాణి చేష్టలు చాలా బోల్డ్ గా ఉంటాయి. కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. సినిమాలు కూడా తగ్గించేసిన సురేఖ కూతురు సుప్రీతతో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోకి వంద ముద్దులు ఇచ్చేస్తా అంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. సురేఖా కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అనారోగ్యంతో సురేఖా వాణి భర్త మరణించారు. అప్పటి నుండి ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. గతంలో ఈ వార్తలను ఖండించారు. కూతురు సుప్రీత అయితే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. నిరాధార కథనాలు రాయొద్దంటూ మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

కాగా నాకు భర్త వద్దు బాయ్ ఫ్రెండ్ కావాలని సురేఖా వాణి తెలియజేశారు. మంచి హైట్, గుడ్ లుకింగ్, డబ్బులున్న బాయ్ ఫ్రెండ్ కావాలి. పెళ్లి మాత్రం చేసుకోనని చెప్పి షాక్ ఇచ్చింది. ఓ నటి తెగించి ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఎవరూ ఊహించరు. తాజాగా ఆమె మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖా వాణి… ముద్దులిచ్చే అవకాశం వస్తే, ఏ స్టార్ హీరోని ముద్దాడుతారని యాంకర్ అడిగారు. ఆ ప్రశ్నకు టక్కున పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. అవకాశం దొరికితే పవన్ కళ్యాణ్ కి వంద ముద్దులు పెడతానని సురేఖా వాణి నిస్సంకోచంగా చెప్పేశారు. పవన్ గురించి సురేఖా వాణి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భర్త మరణం తర్వాత కూతురితో పాటు సురేఖ ఒంటరిగా ఉంటున్నారు. అయితే వీరిద్దరి జోష్ ఫుల్ లైఫ్. సోషల్ మీడియాను వీడియోలు, ఫొటోలతో షేక్ చేస్తూ ఉంటారు. తల్లీ కూతురు కలిసి చేసే డాన్స్ వీడియోలు హీటు పుట్టిస్తాయి. హాట్ ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసి వెళతారు. విందులు, వినోదాలు, పార్టీల్లో పాల్గొంటారు. స్నేహితుల కంటే మిన్నగా మెలుగుతారు.

ఇటీవల సుప్రీత బర్త్ డే పార్టీ జరిగింది. ఆ పార్టీలో కూతురుకి సురేఖా వాణి స్వయంగా మందు తాగించడం సంచలనం రేపింది. మరోవైపు కూతురిని హీరోయిన్ చేయాలనే ప్రయత్నాల్లో సురేఖా వాణి ఉన్నారు. సుప్రీతను స్టార్ చేయాలని ఆమె కలలు కంటున్నారు. నిజంగా సుప్రీత నటిగా సక్సెస్ అయితే సురేఖ పంట పడినట్లే. ఆమెకున్న ఆర్థిక బాధలన్నీ కొట్టుకుపోతాయి. మరి తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా సక్సెస్ కావడం చాలా కష్టం. సుప్రీత జాతకం ఎలా ఉందో చూడాలి.


[…] Also Read: Surekha Vani: సురేఖా వాణి తెగింపు… ఆ హీరోకి వం… […]