Homeఅంతర్జాతీయంIndia strategic changes Himalayas: హిమాలయాల్లో భారత్‌ వ్యూహాత్మక మార్పులు.. చైనాకు ఇక దబిడి దిబిడే!

India strategic changes Himalayas: హిమాలయాల్లో భారత్‌ వ్యూహాత్మక మార్పులు.. చైనాకు ఇక దబిడి దిబిడే!

India strategic changes Himalayas: భారత్‌ చుట్టూ శత్రువులు పెరిగిపోతున్నారు.. పాకిస్తాన్‌ మొదటి నుంచి మన పతనం కోరుకుంటోంది. కానీ అదే పతనం అవుతోంది. తర్వాత చైనా కూడా పాకిస్తాన్‌తో చేతులు కలిపింది. భారత ఎదుగుదలను ఓర్వలేక కుట్రలు చేస్తోంది. ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తోంది. ఇక ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్‌ కూడా చైనాతో కలిసి భారత వ్యతిరేక కుట్రలు చేస్తున్నాయి. ఈ తరుణంలో భారత్‌ కూడా శత్రువులకు దీటుగా వ్యూహాలు రూపొందిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సరిహద్దుల బలోపేతంతోపాటు, ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ హిమాలయ ప్రాంతంలో సైనిక మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేస్తోంది. లాడాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతాల్లో సైనికుల కదలిక, ఆధారాల సరఫరా వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులు యుద్ధ సమయంలో వేగవంతమైన చర్యలకు అవకాశం కల్పిస్తాయి.

న్యోమా ఎయిర్‌స్ట్రిప్‌…
లాడాఖ్‌లోని న్యోమా అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌ (ఏఎల్‌జీ) 13,700 అడుగుల ఎత్తులో పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. 3 కి.మీ. రన్‌వే ఫైటర్‌ జెట్లు, భారీ ట్రాన్స్‌పోర్ట్‌ విమానాలు ల్యాండ్‌ అయ్యేలా దీనిని రూపొందించారు. 2025 నవంబర్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫిల్డ్‌లో భారత వాయుసేనాధికారి ప్రథమ విమానం ల్యాండ్‌ చేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో సెలా టనల్, బీఆర్‌వో ప్రాజెక్టులు..
అరుణాచల్‌ ప్రదేశ్‌లో 13,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన ట్విన్‌–లేన్‌ సెలా టనల్‌ ముందు ప్రాంతాలకు స్థిరమైన మార్గదారి కల్పిస్తోంది. బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) బడ్జెట్‌ 2020లో 280 మిలియన్‌ డాలర్లు నుంచి 2025లో 810 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది వందల కిలోమీటర్ల రోడ్లు, బ్రిడ్జిలు, టనల్స్‌ నిర్మాణానికి దోహదపడుతోంది.

చైనాతో సమానంగా..
చైనా సరిహద్దులో హైవేలు, ఎయిర్‌ఫీల్డ్‌లు ముందుంచినప్పటికీ, భారత్‌ బీఆర్‌వో ప్రాజెక్టులతో లాగ్‌లు తగ్గిస్తోంది. రిమోట్‌ గ్రామాలకు కనెక్టివిటీ, అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌ల అప్‌గ్రేడ్‌లు భారత సైన్యానికి ప్రయోజనం చేకూర్చుతున్నాయి. ఈ చర్యలు రెండు దేశాల మధ్య శక్తి సమతుల్యతను మార్చుతున్నాయి. దీంతో ఇక చైనా చర్యలను దీటుగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు కలిగింది.

ఈ మౌలిక సదుపాయాలు భారత్‌కు హిమాలయాల్లో వేగవంతమైన సైనిక చర్యలు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తాయి. చైనా సవాలుకు తగినట్టు సిద్ధపడటంతో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రయత్నాలు జాతీయ భద్రతకు మరింత బలాన్ని తెస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular