https://oktelugu.com/

Ration : తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ.. తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం!

Ration : తాము అధికారంలోకి వస్తే రేషన్‌(Ration) కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో 2025 జనవరి 1 నుంచే సన్న బియ్యం పంపినీ చేయాలనుకున్నారు. కానీ, అందుబాటులో లేకపోవంతో వాయిదా వేశారు.

Written By: , Updated On : March 20, 2025 / 04:27 PM IST
Ration Rice

Ration Rice

Follow us on

Ration : తెలంగాణ(Telangana)లో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు నిర్ణయం వాయిదా వేసింది. ఈసారి అలాంటి వపరిస్థితి రాకుండా చర్యలు చేపట్టింది. వానాకాలం సేకరించిన సన్న వడ్లను(Paddy)మరాడించి గోదాముల్లో సిద్ధంగా ఉంచింది. మొత్తం 91,19,268 రేషన్‌ కార్డులు ఉండగా వీటిలోని 2,82,77,859 మంది లబ్ధిదారులకు నాలుగు నెలలపాటు సరిపోయే బియ్యం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రభుత్వం సంక్రాంతి(Sankrathi)ఇస్తామని ప్రకటించింది. కానీ, ఉగాది(Ugadi) సందర్భంగా ఏప్రిల్‌ 1 నుంచి రేషన్‌ కార్డులపై సన్న బయ్యిం ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మార్చి 20 ప్రకటించారు. అధికారులు ఏడాదికి 22 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని అంచనా వేశారు. ఈమేరకు నిల్వ ఉన్న బియ్యాన్ని స్టాక్‌ పాయింట్లకు బియ్యం సరఫరా ప్రారంభమైంది. దీంతో ఉగాది నుంచి పంపిణీ పక్కాగా జరుగుతుందని తెలుస్తోంది.

Also Read : తెలంగాణ బడ్జెట్ : మంత్రిత్వ శాఖల వారీగా కేటాయింపులు ఇవీ

సన్నాల సాగుకు ప్రోత్సాహం..
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ప్రకటించింది. దీంతో వానాకాలంలో సన్నాల సాగు పెరిగింది. యాసంగిలో కూడా ఎక్కువ మంది రైతులు సన్నాలు సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సేకరించిన బియ్యన్ని మరాడించి గోదాముల్లో నిల్వ చేశారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీకి స్టాక్‌ సిద్ధం చేస్తున్నారు.