India Vs China: డ్రాగన్‌తో టగ్‌ ఆఫ్‌ వార్‌.. భారత్‌ సైనికుల చేతిలో చైనా చిత్తు వీడియో వరల్‌

కదనరంగంలోనే కాదు.. క్రీడల్లోనూ భారత సైనికులు చైనాను చిత్తుగా ఓడించారు. ఆఫ్రికా దేశంలో నిర్వహించిన ఓ పోటీలో భారత సైనికులు చైనా సైనికులను మట్టి కరిపించారు.

Written By: Raj Shekar, Updated On : May 29, 2024 3:09 pm

India Vs China

Follow us on

India Vs China: భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఐదేళ్లుగా ఈ వివాదం మరింత ముదురుతోంది. గాల్వన్‌ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఇరు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. గతంలో భారత్‌ ఓడినా.. ఇటీవల చైనాకు చుక్కలు చూపుతోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన గాల్వన్‌లోయ ఘర్షణే ఇందుకు నిదర్శనం.

క్రీడల్లోనూ చైనా చిత్తు..
కదనరంగంలోనే కాదు.. క్రీడల్లోనూ భారత సైనికులు చైనాను చిత్తుగా ఓడించారు. ఆఫ్రికా దేశంలో నిర్వహించిన ఓ పోటీలో భారత సైనికులు చైనా సైనికులను మట్టి కరిపించారు. తాజాగా నిర్వహించిన టగ్‌ ఆఫ్‌ వార్‌ (Tug of War) సీపీఎల్‌ఏ సైనికులను ఇండియన్‌ ఆర్మీ సైనికులు చిత్తుగా ఓడించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్‌లో భాగంగా ఆఫ్రికాలోని సూడాన్‌ (sudan)లో భారత్, చైనా సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ గేమ్‌ నిర్వహించారు. ఇందులో చైనాపై భారత్‌ సైనికులు విజయం సాధించారు.

వీడియో వైరల్‌..
ఈ టగ్‌ ఆఫ్‌ వార్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పోటీ మే 28న జరిగినట్లు అధికారులు తెలిపారు. విజయం అనంతరం భారత సైనికులు సంబురాలు చేసుకోవడం ఈ వీడియోలో కనిపించింది. ఈ పోటీలో ఇరు దేశాల మద్దతు దారులు ఎవరికి వారు కేరింతలు కొడుతు ప్రోత్సహించారు. ఈ పోటీలో భారత సైనికులు బలం ముందు చైనీయులు నిలబడలేక.. ముందుకుపడ్డారు.

భారత్‌–ఫ్రాన్స్‌ సైనిక విన్యాసాలు..
ఇదిలా ఉండగా భారత్‌–ఫ్రాన్స్‌ సంయుక్త సైనిక విన్యాసాలు శక్తి–2024 పేరిట మేఘాలయలోని ఉమ్రోయ్‌ జాయింట్‌ శిక్షణ కేంద్రంలో సోమవారం ముగిశాయి. భారత్, ఫ్రాన్స్‌ దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ విన్యాసాలు రెండేళ్లకోసారి జరుగుతాయి. ఒకసారి ఫ్రాన్స్‌లో నిర్వహిస్తే… తర్వాత భారత్‌లో నిర్వహిస్తాయి. 2021 నవంబర్‌లో ఫ్రాన్స్‌లో విన్యాసాలు నిర్వహించారు. తాజాగా భారత్‌లో నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భాగంగా భారత్, ఫ్రాన్స్‌ సైనికులు కూడా సోమవారం టగ్‌ ఆఫ్‌ వార్‌ గేమ్‌ ఆడారు.