Homeక్రీడలుDhanashree Verma: హార్దిక్, నటాషా విడాకుల్లోకి.. చాహల్ భార్య ధనశ్రీని ఎందుకు లాగుతున్నార్రా బాబూ!

Dhanashree Verma: హార్దిక్, నటాషా విడాకుల్లోకి.. చాహల్ భార్య ధనశ్రీని ఎందుకు లాగుతున్నార్రా బాబూ!

Dhanashree Verma: టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా విడాకులు తీసుకున్నారని గత కొద్దిరోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా తన భార్యకు భరణంగా 70 శాతం ఆస్తులు రాసి ఇచ్చాడని తెలుస్తోంది. ఈ పరిణామంతో చాలామంది హార్దిక్ పాండ్యా కు బాసటగా నిలుస్తున్నారు. అతనిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నటాషాను “మోసగత్తె” గా అభివర్ణిస్తున్నారు. అటు హార్దిక్ పాండ్యా, ఇటు నటాషా విడాకుల మధ్యలో టీమిండియా స్పిన్నర్ యజవేంద్ర చాహల్ భార్య ధనశ్రీ పేరు వినిపిస్తోంది. ఆమె తీరును ప్రశ్నిస్తూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో ధనశ్రీ చాలా చురుకుగా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను తనను అనుసరించే వారితో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. ధనశ్రీ మే 27న తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా వరకు ఫోటోలను పోస్ట్ చేసింది. అవి సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టాయి..ఇన్ స్టా గ్రామ్ లో చాలామంది యూజర్ ల నుంచి కామెంట్లు వచ్చాయి.. ధనశ్రీ జిమ్ లో తీసుకున్న ఫోటోలలో సెల్ఫీలు, స్నేహితులతో తీసుకున్న స్నాప్ షాట్ లు ఉన్నాయి.. వీటిని పోస్ట్ చేస్తూ.. discipline, hard work, lots of sweat and butter milk because it’s very hot… అని ధనశ్రీ రాస్కొచ్చింది. అంతేకాదు తన కమిట్మెంట్ చాలా గొప్పదని హైలెట్ చేసింది..

ఆ ఫోటోలను చూసిన చాలామంది ధనశ్రీని అభినందించారు. ఆ ఫోటోలను పోస్ట్ చేసిన కొంత సమయానికే ధనశ్రీ లక్షన్నర లైకులు సొంతం చేసుకుంది.. అనేకమంది కామెంట్స్ కూడా చేశారు.. ఇందులో వచ్చినవన్నీ పాజిటివ్ గా లేవు. యజువేంద్ర చాహల్ తో ఆమెకున్న అనుబంధం పట్ల కొంతమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మరికొంతమంది నటాషా, హార్దిక్ పాండ్యా వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఇంకా కొందరైతే హార్దిక్ పాండ్యాకు పట్టిన దుస్థితే చాహల్ కు కూడా ఎదురవుతుందని అన్నారు.. భవిష్యత్తులో చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పారు.

ఇంకా కొందరైతే ” ముందుగా నీ ఆస్తులు సెక్యూర్ చేసుకో. హార్దిక్ లాగా ఆస్తుల్లో ఎక్కువ భాగం కోల్పోకుండా జాగ్రత్తపడు. ఎందుకంటే ఇటీవల పాండ్యా 2018 నాటి వీడియో బయటికి వచ్చింది. దాన్ని చూసైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలని” నెటిజన్లు చాహల్ కు సూచించారు. ఇంకా కొంతమందయితే ధనశ్రీ పేరును క్రికెటర్ అయ్యర్ తో కలిపి అనుసంధానించారు. ఇటీవల అయ్యర్ ఆ స్థాయిలో సంతోషంగా ఉన్నాడంటే దానికి ధనశ్రీ కారణమని కొంతమంది నెటిజెన్లు బోల్డ్ కామెంట్స్ చేశారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version