Russia Pakistan Friendship: దాదాపు ఏడాదికాలంగా చర్చల దశ దాటని భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక అడుగు పడింది. మధ్యంతర అగ్రిమెంట్ కుదిరింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే మన చిరకాల మిత్ర దేశం రష్యా మాత్రం ఈ డీల్‌పై కోపంగా ఉంది. ఇది రష్యా–భారత సంబంధాల్లో మలుపు తీసుకురావచ్చనే అనుమానాలు ఉన్నాయి. ట్రంప్ భారత్‌పై పన్నులు తగ్గించగా, రష్యా చమురు కొనుగోలు ఆపేస్తామన్న వాదనలు వచ్చాయి. ఇది చిరకాల మిత్రత్వాన్ని పరీక్షిస్తూ, మాస్కోను ఇస్లామాబాద్‌కు దగ్గర చేస్తుందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
రష్యా–భారత బంధం..
రష్యా, భారత్ మధ్య మైత్రి దశాబ్దాల నుంచి బలంగా ఉంది. మోదీ ‘సుఖ దుఃఖాల్లో భాగస్వామి‘ అని పుతిన్‌ను ప్రశంసించారు. యుక్రెయిన్ సంక్షోభ సమయంలో భారత్ రష్యా చమురు దిగుమతులు పెంచి ఆర్థిక ఊతమిచ్చింది. ఇది ఇతర దేశాలు దూరమైనప్పుడు భారత్‌లోని విశ్వసనీయతను చాటింది. సైనిక సామగ్రి, డిఫెన్స్ ఒప్పందాలు ఈ బంధాన్ని మరింత బలపరిచాయి.
ట్రేడ్ డీల్‌లో మలుపు…
‘ట్రంప్ భారత్‌పై పన్నులు తగ్గించిన నేపథ్యంలో ‘రష్యా చమురు కొనుగోలు ఆపేస్తుంది‘’ అని ప్రకటించారు. భారత్ ఈ వాదనను ఖండించకపోవడం, మోదీ ట్రంప్‌ను ప్రశంసించడం గమనార్హం. రష్యా సైతం ‘భారత్ ఎవరి నుంచైనా కొనుగోలు చేయవచ్చు‘ అంటూ సానుకూలంగా స్పందించింది. అయినా, ఈ మార్పు రష్యాకు అసౌకర్యాన్ని కలిగించి ఉండవచ్చు.
పాక్‌తో పుతిన్ దోస్తీ..
ఇస్లామాబాద్‌లో జరిగిన బాంబు దాడిలో 36 మంది మృతితో పాక్ కుప్పకూలినప్పుడు పుతిన్ స్వయంగా ఆసిఫ్ అలీ జర్దారీ, షెహబాజ్ షరీఫ్‌లకు సంతాపం తెలిపారు. ‘ఉగ్రవాదుల క్రూరత్వాన్ని ఖండిస్తున్నాము, భద్రతా కార్యక్రమాల్లో సహకరిస్తాము‘ అని చెప్పారు. గతంలో పాక్‌ను పక్కకు పెట్టిన పుతిన్ ఇప్పుడు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సమావేశాల్లో పాక్ నేతల అభివృద్ధి కూడా ఈ మలుపుకు సూచన.
ట్రేడ్ డీల్ వల్ల రష్యా–పాక్ మధ్య కొత్త సంబంధాలు ఏర్పడితే దక్షిణాసియా శక్తి సమతుల్యత మారనుంది. భారత్ రష్యా చమురు ఆధారాన్ని తగ్గిస్తే, డిఫెన్స్, ఆర్థిక ఆధారాలు దెబ్బతింటాయి. విశ్లేషకులు భారత్ చిరకాల మిత్రుడిని కోల్పోతుందని, మాస్కో పాక్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్ బహుళ ముఖాలతో దౌత్యం సాగించాల్సిన అవసరం తలెత్తింది.