Operation Sagar Bandhu: భారతదేశం పరస్పర సహకారం.. సానుభూతి, దయ కలిగిన దేశం. ఎదుటివారు కష్టాల్లో ఉంటే తోచిన సాయం చేసే గుణం మనది. ముఖ్యంగా మన పొరుగు దేశాలు మనపై శత్రుత్వ భావంతో ఉన్నా.. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మన వంతు సాయంగా అందిస్తున్నాం. తిరిగి రూపాయి కూడా ఆశించడం లేదు. తాజాగా దిత్వా తుపాన్ ప్రభావంతో శ్రీలంక అల్లకల్లోంగా మారింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. భారత్ మానవతా భావంతో స్పందించి. ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా నేవీ, ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
శ్రీలంకకు భారీగా సాయం..
శ్రీలంకలో 2004 సునామీ సమయంలో 23 మిలియన్ల విలువైన సరుకులు, 2009 రాజకీయ సంక్షోభ కాలంలో రూ.500 కోట్ల సాయం, 2017, 2024 తరచూ వరదల సమయంలో కూడా భారతదేశం సహాయం అందించింది. తాజగా దిత్వా తుపాను ప్రభావంతో నష్టపోయిన శ్రీలకకు సాగర బంధు పేరుతో 12 టన్నుల సరుకులు పంపింది.
శత్రుదేశానికి కూడా కూడా సాయం
పాకిస్తాన్‌లో 2006లో వచ్చిన భూకంప సమయంలో భారత్ 50 మిలియన్ డాలర్ల సాయం పంపించింది. మన సైన్యం పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి ప్రజలను రక్షించింది. వైద్య సాయం అందించింది. కానీ దీనిని విస్మరించిన పాకిస్తాన్.. 2008లో ముంబై ఉగ్రదాడి చేసింది.
మయన్మార్‌కు..
మయన్మార్‌లో టైపూన్ యాగి వచ్చిన సమయంలో కూడా భారత్ భారీగా సాయం చేసింది. కొన్ని నెలల క్రితం సైక్లోన్ మోచ వచ్చింది. దీంతో మయన్మార్ తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు కూడా భారీగా సాయం చేశాం.
టర్కీ భూకంప సమయంలో..
2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చిది. ఈ సమయంలో ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందు స్పందించిందిన మనమే. భారత సైన్యం సహాయం చేసింది. దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ప్రజలకు సరుకులు, వైద్య సాయం చేసింది. కానీ దీనిని మర్చిపోయిన టర్కీ ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు డ్రోన్లు అందించి మనపై దాడికి ప్రోత్సహించింది. బంగ్లాదేశ్‌తో సహాకారం చూపించడం విరోధాభాసాలకు దారి తీసింది.
మానవత్వపు నిలువ
మన దేశం ఎప్పుడూ సహాయ దృక్పథంతోనే వ్యవహరిస్తుంది. సత్సంబంధాలు కోరుకుంటుంది. కానీ మన పొరుగున్న ఉన్న ఈ దేశాలను మనపై ఎప్పుడూ ద్వేష భావం ప్రదర్శిస్తున్నాయి. శత్రదేశాల ప్రజల మనసు గెలుచుకుంటున్నా.. అక్కడి పాలకులు మాత్రం కయ్యానికి కాలుదువ్వుతున్నారు.