Homeఅంతర్జాతీయంIndia Russia Strategic Talks 2026: పశ్చిమాసియాపై ప్రపంచం దృష్టి.. సైలెంట్‌గా భారత్‌–రష్యా కీలక చర్చలు!

India Russia Strategic Talks 2026: పశ్చిమాసియాపై ప్రపంచం దృష్టి.. సైలెంట్‌గా భారత్‌–రష్యా కీలక చర్చలు!

India Russia Strategic Talks 2026: గల్ఫ్‌ యుద్ధం, ఇరాన్‌–అమెరికా రెండు వారాల యుద్ధవిరమణ ఒప్పందం ప్రపంచవ్యాప్త చర్చనీయాంశాలైనప్పుడు, అద్భుతాలు, హడావుడి, ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా జరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రపంచం మొత్తం గల్ఫ్‌ యుద్ధంపైన, రెండు వారాల యుద్ధ విరమణ ఒప్పందంపై దృష్టిపెట్టిన సమయంలో భారత దేశంలో చాలా సైలెంట్‌గా ఒక అద్భుతం జరిగింది. దాని ప్రభావం, పరిణామం చాలా దీర్ఘకాలికంగా ఉండనుంది. భారత్, రష్యా కలిసి ఈ పని చేశాయి. రష్యా డెప్యూటీ ప్రధాని, విదేశాంగాల మంత్రి డెనిస్‌ మంతురోవ్‌ ఢిల్లీకి చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీని, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను కలిశారు. ఈ సమావేశాలు రహస్యంగా జరిగి, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై లోతైన చర్చలకు దారితీశాయి. ఈ పర్యటన రష్యా–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపర్చింది.

గల్ఫ్‌ యుద్ధంపై విస్తృత చర్చలు..
సమావేశంలో గల్ఫ్‌ యుద్ధం, అమెరికా–ఇజ్రాయెల్‌ పాత్రలు, అరబ్‌ దేశాల ఆసక్తులు, యూరప్‌ దేశాల వ్యవహారాలు, ఇరాన్‌ పరిస్థితి అంశాలు వివరంగా చర్చించారు. ఇరాన్‌పై దాడిని షియా–సున్నీ ఘర్షణగా చూస్తూ, రష్యా ప్రభావ ప్రాంతాలైన తజకిస్తాన్, కజకిస్తాన్, అజర్‌బైజాన్‌లోని షియా జనాభా పరిస్థితి, భారత్‌లో లఖ్నౌ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో షియా ఆధిపత్యం గురించి మాట్లాడారు. రానున్న రోజుల్లో ఈ ఘర్షణలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్‌–రష్యా రెండు దేశాలు ఈ పరిణామాలకు ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.

ఫాల్‌క్లెయిన్స్‌ గుర్తించి భద్రతా వ్యూహాలు..
ఎక్కడ ఘర్షణలు జరిపించే ప్రమాదం ఉందో వాటిని గుర్తించి భద్రతను బలోపేతం చేయాలని చర్చించారు. మణిపూర్‌లో ఇటీవల మిలిటరీ బేస్‌పై దాడి, అంతకు ముందు జరిగిన ఎత్నిక్‌ అల్లర్లు ఉదాహరణలుగా తీసుకున్నారు. ’పిన్‌ పాయింట్స్‌’ శత్రువులు ఎక్కడ నొక్కితే నొప్పి ఉంటుందో (వంటి సెన్సిటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బార్డర్‌ పోయింట్లు)గుర్తించి కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ చర్చలు భద్రతా యూనిట్లకు కొత్త డైరెక్టివ్స్‌ ఇచ్చాయి.

దోవల్‌–రష్యా భద్రతా సంబంధాలు..
అజిత్‌ దోవల్‌ ఏటా రష్యాకు వెళ్లి జాతీయ భద్రతా సలహాదారు నికోలాయ్‌ పట్రుషెవ్‌ను కలుస్తారు. 2023లో కెమ్రిన్‌లో పుతిన్‌తో, సెప్టెంబర్‌లో మాస్కోలో రష్యా ఎన్‌ఎస్‌ఏతో చర్చలు జరిపారు. 2025 ఆగస్టులో ఆ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక్కడ పుతిన్‌ స్వయంగా దోవల్‌ పర్యటనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సంబంధాలు భారత్‌కు అత్యంత విశ్వసనీయమైనవి. ఇజ్రాయెల్‌తో కలిపి రష్యా నుంచి ఇంటలిజెన్స్‌ షేరింగ్‌ జరుగుతోంది పాలస్తీనా, హమాస్‌ ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చేరే రూట్లు, ఫండింగ్‌ నెట్‌వర్క్‌లు వంటి వివరాలు తెలుస్తున్నాయి.

తాజా ఇంటెల్‌ షేరింగ్‌..
తాజాగా రష్యా అందించిన సమాచారం ప్రకారం, అమెరికా మాజీ సైనికుడు భారత్‌ ద్వారా మయన్మార్‌ (బర్మా)కు చేరి చట్టవిరుద్ధ ఆయుధ సరఫరా, ట్రైబల్‌ గ్రూప్స్‌కు మద్దతు చేస్తున్నాడు.ఉక్రెయినియన్‌ మెర్సినరీలు కూడా పాలుపంచుకుని పట్టుబడ్డారు. నార్త్‌ ఈస్ట్‌లో మయన్మార్, బంగ్లాదేశ్‌ ఫ్రంటియర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, డ్రగ్‌ ట్రాఫికింగ్, ఆర్మ్స్స్‌ స్మగ్లింగ్‌ గుర్తించారు. పాకిస్తాన్‌ మంత్రుల (షెహబాజ్‌ షరీఫ్‌ క్యాబినెట్‌ నుంచి) ‘యుద్ధం జరిగితే కోల్‌కతా వరకు వస్తాము‘ హెచ్చరికలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ విభజన గుర్తు చేశారు. ఈ సమావేశంలో భారత వ్యతిరేక శక్తులను (పాక్, చైనా ప్రాక్సీలు) గుర్తించి ఎదుర్కొనేలా రష్యా రియల్‌టైమ్‌ ఇంటెల్‌ ఇస్తోంది.

ఈ సైలెంట్‌ డిప్లొమసీ భారత్‌కు మల్టీ–ఫ్రంట్‌ ప్రమాదాలను (ఉగ్రవాదం, ఎత్నిక్‌ కాన్‌ఫ్లిక్ట్స్, పొరుగు ఇన్‌ఫిల్ట్రేషన్‌) ముందుగా గుర్తించే అవకాశం ఇస్తోంది. రష్యా–ఇజ్రాయెల్‌ ఇంటెల్‌ నుంచి వచ్చే సమాచారం ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అరికట్టుతుంది. గల్ఫ్‌ యుద్ధ హడావుడిలో భారత్‌ స్వతంత్ర వ్యూహం రూపొందిస్తోంది. ఇది షియా–సున్నీ టెన్షన్స్, ఈస్ట్రన్‌ ఫ్రంట్‌లో దీర్ఘకాలంలో ప్రాంతీయ స్థిరత్వానికి బలమైన పునాది వేస్తుంది. రష్యా మద్దతు భారత్‌కు జియోపాలిటికల్‌ అడ్వాంటేజ్‌ ఇస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version