Homeఅంతర్జాతీయంPakistan Afghanistan Conflict 2026: అటు గొప్పలు.. ఇటు తిప్పలు.. పాకిస్తాన్‌ వీపు వాయిస్తున్న ఆఫ్గానిస్తాన్‌!

Pakistan Afghanistan Conflict 2026: అటు గొప్పలు.. ఇటు తిప్పలు.. పాకిస్తాన్‌ వీపు వాయిస్తున్న ఆఫ్గానిస్తాన్‌!

Pakistan Afghanistan Conflict 2026: ఇరాన్‌–అమెరికా యుద్ధవిరమణకు కారణమని, భవిష్యత్‌ చర్చలకు ఇస్లామాబాద్‌ వేదికని పాకిస్తాన్‌ ప్రపంచానికి చాటుకుంటోంది. ఈ విజయాన్ని ప్రచారం చేస్తూ తమ దిప్లొమసీని ప్రశంసిస్తోంది. ప్రపంచం దృష్టిటో ఒప్పగా చెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇదే పాకిస్తాన్‌ను తన పొరుగు ఆఫ్గానిస్తాన్‌ చితక్కొడుతోంది. వీపు విమానం మోత మోగిస్తోంది. దెబ్బలు తట్టుకోలేక అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోరుతోంది. చైనా కాళ్లు పట్టుకుని బతిమిలాడుతోంది.

ఆఫ్గాన్‌–పాక్‌ మధ్య ఘర్షణ..
పాకిస్తాన్‌ పొరుగులో ఆఫ్గానిస్తాన్‌ దాడులు, ఖైబర్‌ పక్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్‌లో తిరుగుబాట్లు తట్టుకోలేకపోతోంది. ఫిబ్రవరి నుంచి రెండు దేశాల్లో 800 మంది మరణాలు, లక్షలాది నిరాశ్రయులు. పాక్‌ దాడుల్లో మహిళలు, పిల్లలు చనిపోయారు. కాబూల్‌ రిహాబ్‌ సెంటర్‌పై కూడా దాడి. ఆఫ్గాన్‌ సైన్యం పాక్‌ చెక్‌పోస్టులు ఆక్రమించుకుంది. సరిహద్దు 2,430 కి.మీ. ఉద్రిక్తంగా మారింది.

చైనా మధ్యవర్తిత్వం కోసం వేడుకోలు..
ఆఫ్గాన్‌ యుద్ధం ఆపాలని చైనాను ఎంచుకున్న పాకిస్తాన్, విదేశాంగ మంత్రుల స్థాయి చర్చలు బీజింగ్‌లో జరిపింది. గతంలో ఖతార్, తుర్కియే శాంతి కుదుర్చినా ఫిబ్రవరి నుంచి దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పుడు చైనా చేతులు పట్టుకుని శాంతి ఒప్పందం కోరుతోంది. ఇరాన్‌ విషయంలో అమెరికా తాబేదారుగా పనిచేసిన పాక్, సొంత సమస్యల్లో చైనా మద్దతు కోరుతోంది.

పాక్‌ సరిహద్దు మొత్తం ఉద్రిక్తతలే..
పాకిస్తాన్‌కు 8 వేల కి.మీ. సరిహద్దు కలిగి ఉంది. భారత్‌తో 3,323 కి.మీ., ఆఫ్గాన్‌తో 2,430 కి.మీ., ఇరాన్‌తో 959 కి.మీ., 1,049 కి.మీ. సముద్ర తీరం ఉన్నాయి. ఈ విస్తృత సరిహద్దులను కాపాడే సైనిక శక్తి పాక్‌కు లేదు. సముద్ర మార్గం మూసివేస్తే చమురు, సరుకుల సరఫరా ఆగిపోతుంది. ఒకేసారి బహిరంగ ప్రమాదాలు పెరిగితే తట్టుకునే స్థితి లేదు. ఈ పరిస్థితిలో ఆఫ్గాన్‌తో శాంతి కుదుర్చుకోవడం పాకిస్తాన్‌కు అత్యవసరం.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభం..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంంటోంది. అప్పులు చేస్తేగాని పూటగడవని పరిస్థితి. మరోవైపు గల్ఫ్‌ దేశాలు, చైనా బకాయిల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఇక యుద్ధం కారణంగా పాకిస్తాన్‌ తీవ్రంగా నష్టపోతోంది. ఆఫ్గానిస్తాన్‌ సరిహద్దుల్లో తీవ్ర అలజడి నెలకొంది. దీంతో యుద్ధం ఆపితేనే మంచిది అని పాకిస్తాన్‌ భావిస్తోంది. ఇందుకోసం చైనాను శరణు కోరుతోంది.

పాకిస్తాన్‌ ప్రపంచ శాంతికి వ్యూహాలు చాటుకుంటూ, సొంత దేశంలో ఆఫ్గాన్‌ దాడులు, తిరుగుబాట్లు ఎదుర్కొంటోంది. ఇరాన్‌ విషయంలో అమెరికా ఆటలో ఆడిన పాక్, ఆఫ్గాన్‌ సమస్యల్లో చైనా మీద ఆధారపడుతోంది. భారత్‌పై దాడులకు ఆఫ్గాన్‌ను ఆయుధంగా భావించిన ప్లాన్‌ రివర్స్‌ అయింది. ఈ డ్యూబుల్‌ స్టాండర్డ్‌ పాక్‌ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. చైనా మధ్యవర్తిత్వం విజయవంతమైతే మాత్రమే స్థిరత్వం వస్తుంది, లేకపోతే ప్రాంతీయ అస్థిరత మరింత పెరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version