Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 collections: రోజు రోజుకి తగ్గిపోతున్న 'ధురంధర్ 2' వసూళ్లు.. 3 వారాల్లో వచ్చిన...

Dhurandhar 2 collections: రోజు రోజుకి తగ్గిపోతున్న ‘ధురంధర్ 2’ వసూళ్లు.. 3 వారాల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Dhurandhar 2 collections: ఉగాది/ రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని , ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి 11 రోజులు రాబట్టిన వసూళ్లను చూసి ట్రేడ్ మొత్తం నివ్వెరపోయింది. ఈ ఊపు చూస్తుంటే , కచ్చితంగా ఈ చిత్రం 2500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి కనీసం 2000 వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను క్లూడా రాబట్టడం కష్టం గా మారిపోయింది. 12 వ రోజు నుండి రోజురోజుకు వసూళ్లు తగ్గిపోతూ వచ్చాయి. ‘ధురంధర్’ చిత్రానికి 2 నెలల పాటు థియేట్రికల్ రన్ వచ్చేలోపు, ‘ధురంధర్ 2’ కి కూడా అదే రేంజ్ రన్ వస్తుందని అనుకున్నారు. కానీ IPL ఎఫెక్ట్ కారణంగా వసూళ్లు బాగా పడిపోయాయి. అయినప్పటికీ స్టడీ రన్ ని సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ లో 1800 కోట్ల గ్రాస్ మార్కుని టార్గెట్ చేసింది.

ఇక ఈ చిత్రానికి వారాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , ప్రీమియర్స్ + మొదటి వారం కలిపి ఈ చిత్రానికి దాదాపుగా ఇండియా వైడ్ గా 690 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెండవ వారం లో 271 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, కేవలం ౩వ వీకెండ్ నుండి 80 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా 19 వ రోజున 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి 20 వ రోజున 11 కోట్లు , 21 వ రోజున 8 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మూడు వారాలకు కలిపి ఈ చిత్రానికి 1070 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు ఇండియా నుండి వచ్చాయి.

ఇండియా వైడ్ గా గ్రాస్ లెక్కల్లోకి చూస్తే 1263 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 404 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ కి అతి పెద్ద మార్కెట్ గా పిలవబడే మిడిల్ ఈస్ట్ లో ఈ చిత్రం విడుదల బ్యాన్ చేసినప్పటికీ కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో ఈ చిత్రం విడుదల అయ్యుంటే కచ్చితంగా మరో 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అదనంగా వచ్చేవి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 1667 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ లో కూడా డీసెంట్ గ్రాస్ నమోదు అయ్యే అవకాశాలు ఉండడంతో , నాల్గవ వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రానికి 1750 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version