Pakistan on Ayodhya Ram Mandir: అయోధ్యలో రామాలయ నిర్మాణం సంపూర్ణం అయిన సందర్భంగా నవంబర్ 25న అయోధ్యలో ప్రధాని నరేంద్రమోదీ ధ్వజం ఎత్తారు. 500 ఏళ్ల భారతీయుల కల నెరవేరిందని ప్రకటించారు. ఈ జెండా ఉదయం 11:52 నుండి 12:35 మధ్య ధ్వజారోహణ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ జెండా సూర్యుడి చిహ్నం, ఓం, కోవిదర్ర చెట్టు వంటి ప్రాతినిధ్యాలు కలిగి ఉంది. అనేక మంది పూజారులు, అలంకారాలు, అర్చనలు చేశారు. ఈ కార్యక్రమం భారత్‌లోని ఆధ్యాత్మిక మరియు వైభోగమైన చరిత్రను ప్రతిబింబిస్తోంది.
పాక్ విమర్శలు..
ఈ ఘనకార్యంపై పాకిస్తాన్ విమర్శలు చేయడం జరిగింది. బాబ్రీ మసీదు కూల్చిపట్టిన స్థలంలో రామ మందిరాన్ని నిర్మించి, ఇప్పుడు జెండా ఆవిష్కరణల ద్వారా మైనార్టీలపై ఒత్తిడి పెంచుతున్నట్లు పాక్ ఆరోపించింది. అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించుకోవడానికి భారత ప్రభుత్వ యత్నిస్తోదని పేర్కొంది.
తిప్పికొట్టిన భారత్..
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ పాక్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. మత వివక్షకు సంబంధించిన మచ్చలతో ఉన్న పాకిస్తాన్ ముందు తనను తాను విమర్శించుకోవడం మంచిదని చెప్పారు. మైనార్టీ హక్కుల ఉల్లంఘనలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉందని స్పష్టంచేశారు. తాము ఒప్పుకోవలసిందే అయితే ఈ కాంట్రవర్స్ వదిలి తమ అంతర్గత సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
Also Read: ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారా? పాకిస్తాన్ లో పరిస్థితులు చేయిదాటి పోతున్నాయా?
మన దేశంలో మన రామాలయంపై ఏ జెండా పెట్టుకుంటే పక్క పాకిస్తానోడికి ఎక్కడో కాలుతున్నట్లు ఉంది. మన ఆధ్యాత్మిక శక్తిని దాయాది దేశం తట్టుకోలేకపోతోంది. మన ఐక్యతను జీర్ణించుకోలేకపోతోంది. జెండా ఆవిష్కరణ సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.