New opportunity for Indians: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక భారత్‌పై అక్కసు వెల్లగక్కుతున్నారు. ఆంక్షలు విధిస్తున్నారు. టారిఫ్‌లు వేశారు. హెచ్–1బీ వీసాలు తగ్గించారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆదేశించారు. పార్ట్‌టైం జాబులు కూడా చేసుకోకుండా ఆంక్షలు పెట్టారు. కానీ ట్రంప్‌కు ఇప్పుడు జ్ఞానదోయం అవుతోంది. ఆంక్షలతో భారతీయులతోపాటు అమెరిక వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. దీంతో ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. న్యూయార్క్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతు దారు ఓడిపోయారు. అమెరికా వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయాలపై ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మారిపోయారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ విధానాలలో మార్పులు కనిపిస్తున్నాయి. భారతీయులను తిరిగి ఉద్యోగ అవకాశాల్లో అవకాశాలు కల్పించేలా నిబంధనలు సడలించారు.
భారతీయులకు ఉద్యోగాలు..
అమెరికా వ్యక్తికి ఉద్యోగం ఇస్తే అక్కడి నిబంధనల ప్రకారం గంటకు 17 డాటర్లు ఇవ్వాలి. అదే భారతీయులకు 5 నుంచి 6 డాలర్లు ఇస్తే సరిపోతుంది. దీంతో వ్యాపారులు భారతీయులవైపు మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ ఆంక్షలతో వ్యాపారాలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపార వేతనాలకు, విదేశీయుల ప్రవాసానికి సంబంధించిన విధానాల్లో సున్నితమైన మార్పులు చేస్తున్నారనేది ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం.
పుంజుకుంటున్న వ్యాపారాలు..
న్యూయార్క్ ఎన్నికలలో కొన్ని ప్రతికూల ఫలితాల తర్వాత ట్రంప్ తన విధానాల్లో కొంత మార్పు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది వ్యాపారాల పుంజుకోవడానికి దోహదపడుతుంది. భారతీయులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటం, వీసాల పరిమితులు శీఘ్ర తగ్గిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధానాలతో అమెరికా మార్కెట్లో్ల కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతేకాకుండా, ట్రంప్ ప్రభుత్వం 2025లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఈమార్పులు చేసి ఉద్యోగ వేతనాలు, వీసా నిబంధనలు మెరుగుపరిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో, ట్రంప్ పాలనలో వ్యాపార, వలస విధానాల్లో వస్తున్న సానుకూల మార్పులు భారతీయులకు మంచి అవకాశం కాబోతున్నాయని వివిధ అర్థశాస్త్రులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.