India Japan Meeting: జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తారు. భద్రతా పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తారు. అంతర్జాతీయ సమావేశాల వేదికను వివిధ దేశాల ప్రతినిధులు ముందుగా తనిఖీ కూడా చేస్తారు. అయితే చిన్నచిన్న పొరపాట్లు పెద్ద సమస్యగా మారతాయి. తాజాగా భారత్‌లోని ఈశాన్యం రాష్ట్రం అస్సాం రాజధాని గౌహతిలో జరగాల్సిన సమావేశం ఒక పెయిటింగ్ కారణంగా వేదికను మార్చాల్సి వచ్చింది. ఫలితంగా ఏడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి నష్టం జరిగే ప్రమాదం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహించే ఈ సమావేశం ఈశాన్య రాష్ట్రాల్లో (ఏడు సోదరి రాష్ట్రాలు) జపాన్ పెట్టుబడులు, వంతెనలు, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, నీటి సరఫరా వంటి పథకాలపై ఒప్పందాలు చేసుకోవడానికి ఉద్దేశించబడింది. జపాన్ ఇప్పటికే అస్సాం నుంచి మేఘాలయ వరకు 19 కిలోమీటర్ల వంతెన నిర్మించి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను సులభతరం చేసింది. ఈ సహకారం ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం పెంచి, వ్యూహాత్మకంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఒక పెయింటింగ్‌తో మారిన ప్రణాళిక..
అస్సాంలో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ థాయ్‌లాండ్‌లో నీటిలో మునిగి మరణించిన సంఘటన తర్వాత, ఒక పెయింటర్ ఫ్లైఓవర్‌పై ఆయన నీటిలో మునుగుతున్న దృశ్యాన్ని వేసి, సంఘీభావ సందేశం రాశాడు. ఇది సమావేశం కోసం ఫ్లైఓవర్‌ను అందంగా తీర్చిదిద్దే సమయంలో జరిగింది. జపాన్ తనిఖీ బృందం ఈ పెయింటింగ్‌ను గమనించి, అభిమానులు రావడం వల్ల భద్రతా సమస్యలు ఏర్పడవచ్చని భావించి, సమావేశం ఢిల్లీకి మార్చాలని సూచించింది. దీంతో ఫ్లైఓవర్ బ్లాక్ అయి, అభిమానులు రావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎవరీ పెయింటర్?
ఈ పెయింటర్ మార్షల్ బరువా అనే వ్యక్తి. ఆయన పర్యావరణ సమస్యలపై నిరసనలు చేస్తూ, వంతెన నిర్మాణం కోసం చెట్లు తొలగించడాన్ని వ్యతిరేకించి రోడ్లు బ్లాక్ చేసినట్లు సమాచారం. ఆయనకు కొన్ని ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర ఉందని, ఆ చర్యలు ప్రభుత్వ వ్యతిరేకిగా చూడబడుతున్నాయని తెలుస్తోంది. ఇటువంటి చర్యలు వ్యక్తిగత వ్యక్తీకరణగా లేదా నిరసనగా చూడవచ్చు, కానీ వాటి పరిణామాలు విస్తృతంగా ఉంటాయి.
ఈశాన్య రాస్ట్రాల అభివృద్ధి కోసమే సమావేశం..
ఈ సమావేశం ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలని ఆశించారు. రోడ్లు, వంతెనల మెరుగుదలతో ఆగ్నేయాసియాతో వాణిజ్య, కనెక్టివిటీ పెరగవచ్చు. ఇది ప్రాంతీయ సమతుల్యతకు, ఆర్థిక వద్ధికి సహాయపడుతుంది. జపాన్ వంటి దేశాల సహకారం ఈ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకం.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి భారతదేశానికి చాలా ముఖ్యం. జపాన్ వంటి భాగస్వాముల సహకారం రోడ్లు, వంతెనల నిర్మాణంలో సహాయపడుతుంది.ౖ హెదరాబాద్‌లో కూడా ఇలాంటి సమావేశాలను అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి చర్యలు ప్రత్యామ్నాయాలు సూచించకుండా కేవలం అడ్డుకోవడం లక్ష్యంగా ఉంటే, అభివృద్ధి ప్రక్రియ నెమ్మదిస్తుంది. నిజమైన ప్రగతి కోసం సంవాదం, సహకారం అవసరం. చిన్న తప్పులు లేదా ఉద్దేశపూర్వక చర్యలు ఎలా పెద్ద నష్టాలు కలిగిస్తాయో ఈ సంఘటన చూపిస్తుంది.
