Homeఅంతర్జాతీయంStrait Of Hormuz Crisis India Ships Safe: భారత్‌కు ఇరాన్‌ గుడ్‌ న్యూస్‌.. హర్మూజ్‌లో...

Strait Of Hormuz Crisis India Ships Safe: భారత్‌కు ఇరాన్‌ గుడ్‌ న్యూస్‌.. హర్మూజ్‌లో భారత నౌకలు సేఫ్‌..

Strait Of Hormuz Crisis India Ships Safe: ఇరాన్‌–అమెరికా యుద్ధం కారణంగా ఇరాన్‌ తన అధీనంలోని హర్మూజ్‌ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా యూరప్, భారత్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్‌ వంటి దేశాలు తీవ్ర ఇబ్బంది పడ్డాయి. హర్మూజ్‌ మూసివేతతో చమురు ధరలు పెరిగాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్‌ భారత్, చైనా నౌకల రవాణాకు అనుమతి ఇచ్చింది. అయితే తాజాగా హర్మూజ్‌ను అమెరికా దిగ్బంధించింది. దీంతో చాలా నౌకలు చిక్కుకుపోయాయి. అయితే తాజాగా ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిలో భారతీయ నౌకలకు పూర్తి సురక్షితత హామీ ఇచ్చింది. ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య కూడా చాబహార్‌ పోర్టు ప్రాజెక్ట్‌ స్థిరంగా సాగుతోందని రాయబారి ఫతాలీ పేర్కొన్నారు.

ప్రపంచ చమురు రవాణాకు కీలకం..
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్‌ ఆంక్షల మధ్య 111 భారతీయ నౌకలు ఇప్పటివరకు సురక్షితంగా హర్మూజ్‌ దాటాయి. తాజాగా ’గ్రీన్‌ సాన్వీ’ ఎల్‌పీజీ ట్యాంకర్‌ 46,650 టన్నులతో ప్రయాణించింది. ఇరాన్‌ భారత్‌ను ’మిత్రదేశం’గా చూసి ఇతర దేశాల నౌకల అడ్డుకున్నా మినహాయింపు ఇస్తోంది. ఏప్రిల్‌ 18న రెండు నౌకలపై (జగ్‌ అర్నవ్, సన్మార్‌ హెరాల్డ్‌) కాల్పులు జరిగినా, భారత నేవీ అలర్ట్‌లతో భద్రతా వలయం ఏర్పాటు చేసింది.

చాబహార్‌ ప్రాజెక్టు పురోగతి
భారత్‌ రూ.100 కోట్ల చొప్పున గతంలో పెట్టుబడి పెట్టిన చాబహార్‌ పోర్టు (ఇంటర్నేషనల్‌ నార్త్‌–సౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌)లో కీలకం. అమెరికా ఆంక్షలు ప్రభావం చూపినా, 2026 బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోయినా పనులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ భారత నిర్ణయాన్ని ’విచారకరం’ అని విమర్శించినా, పోర్టు పనులు ఆగలేదు.

పాక్‌–చైనా గ్వాదర్‌కు కౌంటర్‌గా..
పాకిస్తాన్‌ గ్వాదర్, పాక్‌ మధ్యప్రాచ్యాన్ని కనెక్ట్‌ చేస్తుంటే, చాబహార్‌ పాక్‌ తప్పించి ఆఫ్ఘన్, మధ్య ఆసియాకు భారత మార్గం. యూఎస్‌ మినహాయింపు రద్దు (2025), ట్రంప్‌ హెచ్చరికలు ఉన్నా భారత–ఇరాన్‌ భాగస్వామ్యం బలంగా ఉంది. ఈ పోర్టు వల్ల భారత వాణిజ్యం 30 శాతం పెరిగే అవకాశం.

అమెరికా ఆంక్షలు, ట్రంప్‌ 25 శాతం సుంకాల హెచ్చరికల నేపథ్యంలో భారత్‌ ఆచితూచి పనిచేస్తోంది. హార్ముజ్‌ మూసివేతలు చమురు ధరలు, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాలను ప్రభావితం చేస్తాయి.. అయినా ఇరాన్‌ భరోసా, నేవీ రక్షణతో భారత వ్యూహాలు సుస్థిరంగా ముందుకు సాగుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version