Kara Movie Minus: ధనుష్ హీరోగా చేసిన ‘కర’ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వచ్చిన విషయం కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. అందువల్లే ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మొత్తానికితే దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపాడు. ప్రతి సన్నివేశాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ధనుష్ లాంటి నటుడు డిఫరెంట్ పాత్రలో కనిపించాలని ఎప్పటికప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తుంటాడు.
కాబట్టి ఈ సినిమా దానికి ఒక మంచి ఎక్స్పరమెంట్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ లో వచ్చే రాబరీ ఎపిసోడ్ అలాగే సెకండ్ హాఫ్ లో హీరో పోలీస్ మధ్య జరిగే ఒక వార్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది…
అయితే సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా వరకు యూజ్ చేసుకుని ప్రయత్నం చేశారు. కానీ అది ఒక మెలో డ్రామాగా మారడం వల్ల సినిమాలు అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. అలా కాకుండా కంప్లీట్ గా సినిమాని మొదటి నుంచి ఎలాగైతే మలిచాడో అదే ధోరణిలో వెళ్లి ఉంటే ఇంకా బాగుండేదని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు…
మొత్తానికైతే ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇంకా కొన్ని కరెక్షన్స్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచేదని మరి కొంతమంది చెబుతున్నారు. రాబోయే సినిమాలతో ఆయన పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ధనుష్ ఈ సంవత్సరం మరో రెండు సినిమాలకు రిలీజ్ చేయాలని చూస్తున్నాడు…చూడాలి మరి తను అనుకున్నట్టుగా సినిమాలు చేస్తాడా లేదా అనేది…