Lok Sabha Elections Results 2024: భారత్‌లో 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరనుంది. ఈమేరకు కార్యరచణ సిద్ధమవుతోంది. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భారత ఎన్నికల ప్రక్రియపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదని ప్రశంసించారు అమెరికా ప్రతినిధ మాథ్యూ మిల్లర్.
ఏమన్నారాంటే..
భారత ప్రభుత్వం దేశంలోని ఓటర్లు అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజవయంతంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారు. ఎవరు ఓడారు అనే అంశంపై మాకు ప్రాధాన్యం కాదు. వాటిపై మేము వ్యాఖ్యలు చేయడం లేదు. గత ఆరు వారాల నుంచి ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదైన ఎన్నికల ప్రక్రియ భారత్‌లో జరగడం చూశాం. అదే మాకు చాలా ముఖ్యం’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు.
ముగిసిన ఎన్నికల సంగ్రామం..
ఇదిలా ఉంటే.. భారత దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల పంగ్రామం ముగిసింది. మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏడు విడతల్లో మార్చి 16 నుంచి జూర్ 1 వరకు పోలింగ్ నిర్వహించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ ఫలితాల్లో బీజేపీ ఒంటరిగా 242 స్థానాల్లో గెలిచింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 294 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలిచింది. ఆపార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి 232 స్థానాలకు పరిమితమైంది.