https://oktelugu.com/

Chandrababu Naidu : మోడీ తర్వాత బలమైన శక్తిగా.. దేశంలోనే పవర్ఫుల్ సీఎంగా చంద్రబాబు ఎలా ఎదిగారు?

నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం.. ఇలా ఎన్నో రికార్డులు చంద్రబాబు సొంతం. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు బాబు.

Written By:
  • Dharma
  • , Updated On : November 13, 2024 / 04:43 PM IST

    Chandrababu Naidu

    Follow us on

    Chandrababu Naidu :  ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇండియన్ మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని మోదీ నిలిస్తే..ఐదో స్థానంలో నిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ చంద్రబాబు తన శక్తి యుక్తులతో పార్టీని అధికారంలోకి తేగలిగారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబుకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో కష్టనష్టాలను అధిగమించారు. నిందలు, అపవాదులను ఎదుర్కొన్నారు. పడిపోయిన ప్రతిసారి నిలబడేందుకు ఆయన పడిన కష్టం వర్ణనాతీతం. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం చంద్రబాబు సొంతం. ఆయన పేరు లేకుండా ఏ రోజు న్యూస్ పేపర్లు అచ్చు అయ్యేవి కాదు. ఏడాది కిందట ఇదే సమయానికి చంద్రబాబు జైల్లో ఉండేవారు. అవినీతి కేసుల్లో అరెస్టయినా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు పాటు గడిపారు. అయితే ఏడాది తిరగకముందే ఆయన దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ జాబితాలో ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇండియా టుడే సంస్థ ప్రకటించిన జాబితాలో ఆయనకు ఈ ఘనత దక్కింది.

    * ఐదో స్థానంలో
    ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ తొలి స్థానంలో నిలిచారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండో స్థానంలో ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుగవ స్థానంలో ఉన్నారు. ఐదో స్థానంలో మాత్రం చంద్రబాబు నిలిచారు. గడిచిన ఐదేళ్లలో రాజకీయ పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు చంద్రబాబు. కానీ ఈ ఎన్నికల్లో కూటమిపరంగా ఏపీలో సూపర్ విక్టరీ సాధించారు. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. 23 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన పార్టీని.. ఐదేళ్లు తిరగకముందే 135 స్థానాలకు పెంచడం అంత ఆషామాషీ కాదు. ఈ ఘనత సాధించిన వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ లీడర్ చంద్రబాబు.

    * ఐదేళ్లుగా ఇబ్బంది కరం
    2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభావం జాతీయస్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఆ ఎన్నికల్లో దారుణ పరాజయంతో చంద్రబాబు ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. జాతీయ రాజకీయాలను శాసించిన చంద్రబాబుకు ఒకానొక దశలో ప్రధాని అపాయింట్మెంట్ కూడా లభించలేదు. కానీ ఇప్పుడు అదే ఢిల్లీలో, జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏపీ అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబెట్టుకుంటున్నారు. అందుకే దేశ రాజకీయాల్లోఅత్యంత శక్తివంతమైన నేతల్లో చంద్రబాబు టాప్ ఫైవ్ లో నిలిచారు. మున్ముందు ఆయన మరింత ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి.కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం.. ఏపీలో చంద్రబాబుకు ఎక్కువ ఎంపీ సీట్లు రావడంతో దేశంలో రాజకీయాలలో చక్రం తిప్పే నేతగా చంద్రబాబు ఎదిగారు.చంద్రబాబు మద్దతు లేకుంటే దేశంలో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉండడంతోనే దేశంలో ఇప్పుడు పవర్ ఫుల్ లీడర్లను చంద్రబాబు ఒకరిగా నిలిచారు