Bulgaria Bridal Market: యూరప్ అంటేనే చాలా అభివృద్ధి చెందిన దేశాలుగా చెబుతారు. ఎందుకంటే యూరప్ దేశాలే ప్రంపంచంలో అనేక దేశాలను గుర్తించి పాలించాయి. వందల ఏళ్లు సంపదను తరలించుకుపోయాయి. ఇంత అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో ఒకటి బల్గేరియా. అయితే ఈ దేశంలోని కలైద్‌జీ గిరిజన తెగలో ఇప్పటికీ అమ్మాయిలను వేలం నిర్వహించే ఆచారం ఉంది. ఈ వేలంలో 13 ఏళ్ల పైబడిన అమ్మాయిలను వేలం విధంగా విక్రయిస్తున్నారు. నీలి కళ్ల అమ్మాయిలకు అత్యధిక ధరలు పడతారు, తర్వాత బ్రౌన్, బ్లాక్ కళ్ల అమ్మాయిలకు వరుసగా ధరకు ఉంటుంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్మాయిలకు చెల్లిస్తారు.
వేల సందడి, నియమాలు..
ఈ వేలం కార్యక్రమంలో భాగంగా గ్రామçస్తులు సంప్రదాయ విధానాలను కట్టుబడి పాటిస్తారు. అమ్మాయిలు కుటుంబ సభ్యులతో మాత్రమే పాల్గొంటారు, పెళ్లి అయినవారు లేదా ఒంటరిగా అబ్బాయిలు అయితే వేలంలో పాల్గొనలేరు. అమ్మాయిలు సాధారణంగానే ట్రెడిషనల్ వస్త్రాలు ధరించాలి. అబ్బాయిలు ఫార్మల్ దుస్తులను ధరిస్తారు. ఈ పండుగకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే ఈ తెగలో సుమారు 18 వేల మంది ఉంటారు.
బంగారం ఆధారంగా సంపద..
వేలం జరిగే రోజున బంగారం చాలానే ప్రదర్శించబడుతుంది, ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మాయిల ఒంటిపై ఉంటుంది. ఇక్కడ అమ్మాయిల ఆరంభ వయస్సు, కళ రంగు, కుటుంబ వారసత్వం ఇలా పలు అంశాలు ధరను ప్రభావితం చేస్తాయి. ఈ సంప్రదాయం యూరోపియన్ దేశాల్లో అరుదైనది, ప్రాచీనకాలం నుండి కొనసాగుతూ వస్తోంది.
ఈ ఆచారం యూరోప్‌లో ప్రాచుర్యం పొందినప్పటికీ, ఇది సమకాలీన నైతిక, మానవహక్కుల ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉండటం వల్ల తీవ్ర విమర్శలనుభవిస్తుంది. ఈ విషయంలో బల్గేరియా మద్యంతర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.