Pakistan attack on Afghanistan: పాకిస్తాన్.. ఇంతకాలం ఆఫ్గానిస్తాన్‌పై అనుకూల వైఖరితో ఉంది. తాము చెప్పినట్లు చేస్తుందని భావించింది. కానీ, కొన్ని నెలలుగా ఆఫ్గానిస్తాన్–భారత్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దీనిని మన దాయాది దేశం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే తెహ్రీక్ – ఎ – తాలిబార్ పాకిస్తాన్ ఉగ్రవాదుల సాకుతో ఆఫ్గాన్‌పై దాడులు చేస్తోంది. తాజాగా మరోమారు దాడికి తెగబడింది. గతంలో ఆఫ్గాన్ విదేశాంగ మంత్రితో భారత్‌లో ఉండగా పాకిస్తాన్ దాడులు చేపట్టింది, తాజాగా ఆఫ్గాన్ వాణిజ్య మంత్రి భారత్‌కు వచ్చిన సందర్భంలో చెప్పుకోదగ్గ ఈ దాడి దేశ మధ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
గత ఘర్షణలు, ప్రతిదాడి
ఆఫ్గాన్‌కు వైమానిక దళం లేదు. ఇదే అదునుగా గతంలో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రతిదాడి చేసింది. ఆఫ్గాన్ సైన్యాలు పాకిస్తాన్ సరిహద్దులోని పాకిస్తాన్ ట్యాంకులను అపహరించింది. 90 మంది పాకిస్తాన్ సైనికులను బంధించింది. దీంతో ఖతార్, టర్కీ చొరవ తీసుకుని ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగేలా చూపాయి.
తాజా దాడితో ఆఫ్గాన్ రెవెంజ్ సిద్ధం
ఇప్పటివరకు పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలు, ఒక మహిళ సహా మంది అమాయకులు మృతి చెందారు. ఈ దాడి వల్ల ఆఫ్గానిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఎదురుదాడికి సిద్ధమవుతోంది. ఆఫ్గాన్ సంస్కృతిలో ’బాదల్’ అనే రూల్, అంటే ప్రతీకారం తప్పనిసరిగా తీర్చుకోవాల్సిన విధానమని భావిస్తారు. మరో ’నాంగ్’ రూల్ లో వ్యక్తి గౌరవం పట్ల హృదయపూర్వక కట్టుబాటు ఉంటుంది. ఈ సాంప్రదాయాలు పాకిస్తాన్‌కు కఠిన గుణపాఠాలు చెప్పడానికి ఆఫ్గాన్ సిద్ధమని స్పష్టంగా హెచ్చరించింది.
ఆఫ్గానిస్తాన్ – పాకిస్తాన్ సంక్లిష్ట సంబంధాలలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్తాన్ దాడులు సాంకేతికంగా, సంప్రదాయికంగా భారత్‌తో క్షోభలు పెట్టే ఉద్దేశ్యంతో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌కు సంబంధించి ఆఫ్గాన్ బాదల్, నాంగ్ నియమానుసారం సమర్ధన ఇవ్వడం ద్వారా ఈ విషయంలో సమన్వయాన్ని పెంచుకోవాలి అని సూచనలున్నాయి.