Food to Ants: ఈ భూమి మనుషులకే కాదు సమస్త జీవరాశులకు సొంతం అనే విషయం చాలామందికి తెలుసు. అందువల్ల మనుషులతో పాటు పక్షులు, జంతువులు, కీటకాలు, క్షీరదాలు కూడా తమ జీవనాన్ని సాగిస్తాయి. అయితే మనుషులు ప్రకృతిని కాపాడితేనే ఆరోగ్యకరమైన జీవనం ఉంటుంది. ఎప్పుడైతే ప్రకృతిని ధ్వంసం చేస్తారో అక్కడ విధ్వంసం ఉంటుందని కొందరు మేధావులు చెబుతూ ఉంటారు. అందువల్ల నేటి కాలంలో ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందని కొందరు పర్యావరణ వేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ప్రకృతి అంటే చెట్లను మాత్రమే కాకుండా కొన్ని జంతువులు, కీటకాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్ గా మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని కీటకాలకు ఆహారం అందించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని అంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే చీమలకు కావాల్సిన ఆహార పదార్థాలను అందించాలని అంటారు. అయితే చీమలకు ఎటువంటి ఆహార పదార్థాలు అందిస్తే పుణ్యఫలం దక్కుతుందో ఇప్పుడు చూద్దాం…
చీమను అనగానే చాలామంది చిన్నచూపు చూస్తారు. కొన్ని రకాల చీమలు మనుషుల నుంచి ఆత్మరక్షణ పొందడానికి కుడుతూ ఉంటాయి. మరికొన్ని రకాల చీమలు ఎలాంటి హాని చేయకపోయినా వాటిని చాలామంది నలిపేస్తారు
అయితే చీమలకు ఆహారం అందించడం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందుతారు అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని అనుకునేవారు చీమలకు కావాల్సిన ఆహారం అందించాలని చెబుతున్నారు.
చీమలు ఎక్కువగా ఇష్టపడేది పంచదార అని అందరికీ తెలుసు. అందువల్ల ఒక చిన్న పాత్రలో పంచదారని ఉంచి చీమలకు ఆహారం ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. చీమలకు పంచదార ఆహారం అందించడం వల్ల ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. అలాగే మరో తీపి పదార్థమైన బెల్లంను కూడా చీమలకు ఆహారం గా అందించాలి. బెల్లంలో చీమలకు అందించడం వల్ల ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అప్పులతో బాధపడేవారు చాలామంది ఉంటారు. ఇలాంటివారు చీమలకు గోధుమపిండి ఆహారంగా అందించాలి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు.
తేనెను మనుషులు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. చీమలు కూడా ఇది ఎక్కడ ఉంటే అక్కడికి క్యూ కడతాయి. అయితే ప్రత్యేకంగా తేనెను చీమలకు ఆహారంగా అందించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. చాలామంది ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేస్తారు. ఇలా వేయడం వెనుక చీమలకు ఆహారం అందించడమేనని పెద్దలు చెబుతారు. అలా ప్రత్యేకంగా చీమలకు బియ్యం పిండిని అందించడం వల్ల ఇంట్లో ధనం ఎక్కువగా నిలుస్తుంది.
చీమలు ఎక్కువగా పుట్టలు పెట్టి తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. అయితే లక్ష్మీ కటాక్షం పొందాలని అనుకునేవారు శుక్రవారం రోజున చీమలకు ఇష్టమైన ఈ ఆహారాలను ఒక పాత్రలో తీసుకెళ్లి పుట్టల వద్ద ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థికంగా వృద్ధి చెందుతారని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.