Telugu movies
Telugu movies : 2025 వ సంవత్సరంలో భారీ సినిమాలు రిలీజ్ అవ్వనున్న నేపధ్యం లో జనవరి నెలలో స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan), బాలయ్య బాబు (Balayya Babu), వెంకటేష్ (Venkatesh) ముగ్గురు కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇందులో వెంకటేష్ సంక్రాంతి విన్నర్ గా నిలువగా బాలయ్య బాబు సెకండ్ పొజిషన్ ని దక్కించుకున్నాడు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడనే చెప్పాలి. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలు సంక్రాంతికి రావడమే కాకుండా ప్రేక్షకులను అలరిస్తూ మంచి వసూళ్లను కూడా రాబడుతున్నాయి…ఇక వీటితోపాటుగా మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లో సందడి చేశాయి. ముఖ్యంగా విశాల్ హీరోగా వచ్చిన ‘మదగజ రాజా ‘అనే డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పటికి అంత పెద్దగా సందడి చేయలేక పోయిందనే చెప్పాలి… ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ‘మార్కో’ సినిమా కూడా జనవరి నెలలో రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ సినిమా మలయాళం లో సక్సెస్ సాధించినంతగా తెలుగులో తన ప్రభంజనాన్ని సృష్టించలేక పోయిందనే చెప్పాలి…ఇక మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయినప్పటికి అవేవి పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఇక జనవరి నెలలో వెంకటేష్ బాలయ్య బాబులు ఇద్దరే భారీ సక్సెస్ లను సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని ని క్రియేట్ చేసుకున్నారు.
సీనియర్ హీరోలు అయినప్పటికి వాళ్ళ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటూ వందల కోట్ల కలెక్షన్లు రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఈ దెబ్బతో సీనియర్ హీరోలు సక్సెస్ లను సాధించలేరు అంటూ గత కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.
అలాగే భారీ సక్సెస్ లను సాధిస్తూ దాదాపు రెండు మూడు వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక వెంకటేష్ తన ఎంటైర్ కెరియర్ లోనే ది బెస్ట్ సక్సెస్ ని నమోదు చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 305 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడం అనేది మామూలు విషయమైతే కాదు…
ఇక జనవరి నెల ముగిసింది. ఫిబ్రవరి నెలలో కూడా మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాలన్నింటిలో ఏ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది. తద్వారా ఫిబ్రవరి నెల కూడా సినిమా ఇండస్ట్రీకి బాగా కలిసి వస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల ముగిసేంత వరకు వెయిట్ చేయాల్సిందే…