https://oktelugu.com/

Maha Kumbh Mela: అప్పుడు తిరుపతి.. ఇప్పుడు మహా కుంభమేళా.. నెటిజన్లతో చీవాట్లు తింటున్న బిగ్ బాస్ బ్యూటీ

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ఈ సారి మరింత ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకలో భాగంగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30కోట్లు మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

Written By: , Updated On : February 6, 2025 / 12:26 PM IST
Maha Kumbh Mela

Maha Kumbh Mela

Follow us on

Maha Kumbh Mela: ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ఈ సారి మరింత ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకలో భాగంగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30కోట్లు మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆధ్యాత్మికతతో కూడిన ఈ వేడుకలో సామాన్యులతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి లాంటి దిగ్గజ రాజకీయ నాయకులు కూడా స్నానమాచరించారు. వీరితో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే సంయుక్త మీనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ వంటి ప్రముఖులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు.

ఇందులో ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు ఫేం ప్రియాంక జైన్, తన ప్రియుడు బుల్లితెర నటుడు శివ కుమార్ తో కలిసి ఈ పవిత్ర వేడుకలో పాల్గొన్నారు. వీరిద్దరూ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ప్రియాంక జైన్ కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశారు. కొద్దిరోజుల్లోనే ఈ పోస్ట్‌లకు పాజిటివ్, నెగెటివిటీతో కూడిన స్పందనలు వచ్చాయి.

నెటిజన్లు ఎక్కువగా ప్రియాంక జైన్ సాంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ ఆమె భక్తి లక్షణాన్ని ప్రశంసించారు. అయితే, కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు. “దేవుడి దగ్గర కూడా ఫోటో షూట్స్, రీల్స్ అవసరమా?” అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు తీసుకుంటున్న విషయంపై విమర్శలు వ్యక్తం చేశారు. “మీరు వెళ్లింది భక్తి కోసమా లేక ఇన్‌స్టా స్టోరీల కోసమా?” అని ప్రశ్నించారు.


తిరుమల పర్యటనపై విమర్శలు
ప్రియాంక జైన్ గతంలో కూడా విమర్శల పాలయ్యారు. ఆమె తిరుమల పర్యటన సమయంలో ఆమె తన ప్రియుడితో కలిసి అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లి, ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించిందని ఒక ప్రాంక్ వీడియో తీసారు. ఈ వీడియో నెగెటివిటీకి కారణమైంది. సామాన్య ప్రజలలో ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తమైంది. ఎందుకంటే తిరుమల ఒక పవిత్ర స్థలం కాబట్టి ఇలాంటి ప్రాంక్ వీడియోలను తీసుకోవడం అనవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఆధ్యాత్మిక యాత్రలపై ప్రియాంక జైన్
ప్రియాంక జైన్ ఇటీవల తన ప్రియుడితో కలిసి పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను, దేవాలయాలను దర్శించుకుంటున్నారు. మహా కుంభమేళా అనంతరం కాశీ వెళ్లే ప్రణాళికలు కూడా వారి వద్ద ఉన్నాయి. ఈ యాత్రల గురించి ఆమె సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటున్నారు. ఈ విధంగా ప్రియాంక జైన్ తమ ఆధ్యాత్మిక ప్రయాణాలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ, వివిధ సమాజంలో పాజిటివ్, నెగెటివ్ విమర్శలు , ప్రశంసలు పొందుతున్నారు.