Syria: పోరాడితే పోయేది ఏమీ ఉండదు. బానిసత్వ సంకెళ్లు తప్ప.. అన్నట్టుగా సిరియా ప్రజలు అక్కడి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న అసద్ కు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అసలు విధానాలతో.. అణచివేత దృశ్యాలతో అక్కడి ప్రజలు దశాబ్దాలుగా విసిగిపోయారు. ఈ క్రమంలో ఇటీవల సిరియాలోని దారా అనే గ్రామంలో ఓ 14 సంవత్సరాల బాలిక “డాక్టర్ ఇప్పుడు నీ వైపు” అని అర్థం వచ్చేలా వ్యూహాత్మకమైన చిత్రాలు గీసింది. దీనిని సహించలేని పోలీసులు ఆమెను, ఆమె స్నేహితురాళ్ల ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో వేశారు. 26 రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. దీంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. దారాలో మొదలైన ఆ ఉద్యమం అసద్ పతనానికి నాంది పలికింది.
అసద్ వెళ్లిపోవడంతో..
తిరుగుబాటుకు భయపడి కుటుంబంతో కలిసి అసద్ ప్రత్యేక విమానంలో పారిపోయాడు. దీంతో అక్కడి ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరుగుబాటుదారులు సిరియా కు కొత్త ఫీచర్ లభించింది అంటూ ప్రకటించారు. తిరుగుబాటు దళాలకు హాసన్ అబ్దుల్ ఘని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరియా రాజధాని డమస్కాస్ ను చుట్టుముట్టి.. అసద్ పరిపాలనకు చరమగీతం పాడారు. ఇక అసదు పారిపోవడంతో ప్రజలు మొత్తం డమాస్కస్ వీధుల్లోకి వచ్చారు. దేవుడి కరుణ వల్ల సంబరాలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నిరంకుశ పరిపాలన నుంచి తమకు విముక్తి లభించిందని వివరిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగానే డమాస్కస్ ప్రాంతంలో దొంగతనాలు జరిగాయి. అధ్యక్ష భవనంలోకి ప్రజలు ప్రవేశించి అనేక వస్తువులను దోచుకున్నారు. సెంట్రల్ బ్యాంకులో నగదు కట్టలు ఉన్న డబ్బాలను దొంగలించికెళ్లారు. అయితే మిగతా డబ్బుకు తిరుగుబాటు దళాలలో పనిచేస్తున్న వ్యక్తులు కాపలాగా ఉన్నారు.
అప్రమత్తమైన ఇజ్రాయిల్
సిరియాలో పరిణామాలు నేపథ్యంలో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. సిరియాకు సమీపంలో తన సైన్యాన్ని భారీగా మోహరించింది. 1974 ఒప్పందం ప్రకారం గోలైన్ హైట్ ప్రాంతంలోని 2/3 వంతు ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంది. మిగతా భూభాగం దానిని బఫర్ జోన్ అని పిలుస్తారు. అది సిరియా ఆధీనంలో ఉంది. సిరియాలో జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహూ నేరుగా రంగంలోకి వెళ్లారు. సైనికులకి దిశా నిర్దేశం చేశారు. గొలన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. ఇటీవల కాలంలో సిరియా ఇజ్రాయిల్ పై దాడులకు పాల్పడింది. హమాస్ ప్రతినిధులు సిరియా మీదుగా ఇజ్రాయిల్ పై దాడికి పాల్పడ్డారు. నాటి నుంచి ఇజ్రాయిల్ సిరియాపై ఆగ్రహంతో ఉంది. అయితే ఇప్పుడు అంతర్యుద్ధం వల్ల సిరియా నాశనం కావడంతో.. ఇజ్రాయిల్ అధినేత నేరుగా రంగంలోకి వచ్చారు. తన సైన్యంతో సంప్రదింపులు జరిపి.. తన దేశానికి నష్టం జరగకుండా చూసుకున్నారు.